కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

కర్ణాటకలో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఎన్నికలకు ముందు అనేక సర్వే సంస్థలు ఎలక్షన్స్ లో వివిధ పార్టీల జయాపజయాలు అంచనా వేస్తుంటాయి. గెలవడానికి ఏ పార్టీ వాళ్లకి ఎక్కువ అవకాశం ఉంది, ఏ పార్టీ వాళ్లకి తక్కువ అవకాశం ఉంది అనేది వీళ్లు ప్రజాభిప్రాయం ప్రకారం కలెక్ట్ చేసి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ సర్వేలు చెప్పేవి మాక్సిమం కరెక్ట్ అవుతాయి.

ఇప్పుడు రైజ్ అనే తెలుగు వాళ్ళకి సంబంధించిన సర్వే సంస్థ ఒకటి గతంలో ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు జరిగితే జగన్ గెలుస్తారని, లేకపోతే ఓడిపోతారని చెప్పింది. ఇప్పుడు అదే సంస్థ కర్ణాటకలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ 86-91 స్థానాలకు పరిమితమవుతుందని, కాంగ్రెస్ పార్టీ 102-115 స్థానాలు గెలుచుకుంటుందని, జెడిఎస్ 24-32 స్థానాలు గెలుచుకుంటుందని, ఇతరులు 4-6 స్థానాలు గెలుచుకుంటారని అంచనా.

ఇందులో పర్సంటేజ్ ప్రకారం చూస్తే బిజెపికి 2018లో 36.35 శాతం వస్తే ఇప్పుడు 32.5కి పడిపోబోతుందట. అదే కాంగ్రెస్ పార్టీ చూస్తే 2018లో 38.14 వస్తే, ఇప్పుడు 42.01శాతం ఓట్లు సాధించబోతుందట. ఆ తర్వాత జెడిఎస్ కి అప్పట్లో 18.3 శాతం వస్తే అది ఇప్పుడు 16.1 కి పడిపోబోతుందని, ఇతరులు 7.48-9.37 కి పెరగబోతున్నారని అంటున్నారు.

అదే సందర్భంలో కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి జిల్లాలు బళ్ళారి, కోలార్, బీదర్. అలాగే బిజెపి బలంగా ఉన్న జిల్లాలు హవేరి, చిత్రదుర్గ్, దావనగిరి, షిమోగా, ఉడిపి, చిక్ మంగళూర్ సౌత్ కన్నడ, కొడుగు అని ఈ సర్వే వాళ్ళు లెక్కకడుతున్నారు. అలాగే బిజెపికి, కాంగ్రెస్ కు టైట్ ఫైట్ ఉన్న ప్రాంతాలు బెల్గావ్, బీజల్ కోట్, బీజాపూర్, గుల్బర్గా, కొప్పల్, గడాక్, తార్వాక్, నార్త్ కన్నడ, బెంగళూర్ అర్బన్, చామరాజ నగర్. జెడిఎస్ తో కలిపి రాయచూర్, తుంకూర్, మైసూర్ ప్రాంతాలలో ట్రయాంగిల్ ఫైట్ ఉన్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: