మోదీ.. ఆ అమ్మాయిల విషయంలో అట్టర్‌ ఫ్లాప్‌?

క్రీడలకు క్రీడాకారులకు ఎంతో విలువ నిచ్చే భారతదేశం. తాజాగా  రెజ్లింగ్ విషయంలో మాత్రం ఎందుకో కాన్సన్ట్రేషన్ చేయలేదు అనిపిస్తుంది అని అంటున్నారు కొంతమంది. రెజ్లింగ్ విషయంలో మహిళా క్రీడాకారిణులు బ్రిజ్ భూషణ్ మీద కంప్లైంట్ ఇచ్చినా విచారణ అనేది నార్మల్గానే పరిమితం అవడం, చివరికి కేంద్రమంత్రి  మాట్లాడుతూ దర్యాప్తుకు ఆదేశించానని చెప్పినా కథ మాత్రం ముందుకు జరగకపోవడంతో, అసలు తెర వెనక ఏం జరుగుతుందనేది అర్థమవడం లేదని కొంతమంది అంటున్నారు.

చివరికి కోర్టు జోక్యం చేసుకుని కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పడం కూడా జరిగింది. ఈలోగా ప్రియాంక దగ్గర నుండి కేజ్రీవాల్ దాకా ఆ మహిళా క్రీడాకారిణికి మద్దతు పలకడం అనేవి కూడా జరిగిపోయాయి. రెజ్లింగ్ అంటే కుస్తీ అని అర్థం. గతంలో రాజుల కాలంలో ఎక్కువగా మన వైపు ఈ కుస్తీ పోటీలు బాగా జరిగేవి‌. ఇప్పుడైతే ప్రత్యేకంగా పంజాబ్, హర్యానాలో వీటికీ ప్రత్యేక ఆదరణ ఉందని, అందులోనూ మహిళలు ఎక్కువగా అటువైపు ఆసక్తి చూపిస్తారని తెలుస్తుంది.

ఆ నేపథ్యంలోనే, ఆ రెజ్లింగ్ నేపథ్యంలోనే మనకు దబాంగ్ అనే సినిమా కూడా రావడం జరిగింది. ఆ సినిమాలో మహిళా క్రీడాకారులు రెజ్లింగ్ విషయంలో ఎంత ఆసక్తి చూపిస్తారో అనేది చూపించడం అయితే జరిగింది. అక్కడ మహిళలు అంత ఆసక్తి చూపిస్తున్న రీజనింగ్ విషయంలో ఎవరో ఒక వ్యక్తి వచ్చి వేధిస్తే ఆ వ్యక్తి పైన ఎటువంటి చర్యలు ఇప్పటివరకు స్పష్టంగా తీసుకోని కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ కొంతమంది అంటున్నారని తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది రాజకీయంగా పెద్ద ఫెయిల్యూర్ అని వాళ్లు అంటున్నారు.

అయితే మహిళా క్రీడాకారిణిపై సెక్సువల్ హెరాస్మెంట్ విషయంలో విచారణకు సుప్రీంకోర్టు అడ్వకేట్ జనరల్ తుషార్ మెహతా తన వైపు నుండి అభ్యంతరం ఏమీ లేదని చెప్పేసరికి పోలీస్ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఆ మహిళా క్రీడాకారిణికి  న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: