జగన్‌ విమర్శలను నిజం చేస్తున్న బాబు, పవన్‌?

భారతీయ జనతా పార్టీ తమతో వస్తే, కలిసి వెళ్తామని లేదంటే గొడవలు అయితే పెట్టుకోము అనే నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఒకవేళ తమతో పాటు రాకపోతే బిజెపి రాష్ట్ర నాయకత్వాన్ని తిట్టుకుంటారు గాని మోడీని అయితే ఇద్దరిలో ఎవరూ విమర్శించరు. పైగా ఏదో ఒక సందర్భం చెప్పుకొని అభినందిస్తూ ఉంటారు. రాష్ట్ర నాయకత్వం వల్లనే మేము దూరంగానీ, లేదంటే  మేము ఎప్పుడూ మోడీకి సాన్నిహిత్యంగానే ఉంటామని చెప్తూ ఉంటారు.

మమ్మల్ని ఇక్కడ గెలిపిస్తే మేము కేంద్ర ప్రభుత్వానికి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటాము. ఇప్పటి వరకు జగన్ ని మోడీ మనిషి, మోడీ దత్తపుత్రుడు అని ఏ రకంగా అన్నారో, అదే విధంగా మేము కూడా మోడీతో సన్నిహితంగానే ఉంటాము. ఎందుకంటే మోడీని కాదని, కేంద్రాన్ని కాదని ఇక్కడ గెలవడం కష్టం. అలాగని బిజెపిని కలుపుకుని ముందుకు వెళ్దామంటే రాష్ట్ర నాయకత్వం కలిసి రావడం లేదు‌. ముందుకు వెళ్లకుండా బిజెపి రాష్ట్ర నాయకత్వం అడ్డుకుంటుంది అని ఒక వైపు పరోక్షంగా సంకేతం ఇస్తూనే, వాళ్ళు రాకపోయినా మేము కేంద్రంతో ముందుకు వెళ్తాం అన్నట్టుగా వీళ్ళు ఇద్దరు సంకేతం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. దానికి సజీవ సాక్ష్యంగా మొన్న చంద్రబాబు నాయుడు గారితో కలవడానికి ముందే పవన్ కళ్యాణ్ ఒక వీడియో రిలీజ్ చేశారని తెలుస్తుంది.

దాంట్లో ఆయన మోడీ రెగ్యులర్ గా పాల్గొనే మన్ కీ బాత్ కార్యక్రమం గురించి పొగడడం జరిగింది. మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ గురించి ఆయన మాట్లాడినట్టుగా తెలిసింది. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే రెగ్యులర్ గా జరిగే మన్ కి బాత్ కార్యక్రమాన్ని ఈయన పొగడారంటే పవన్ కళ్యాణ్ కేంద్రం వైపు, అంటే మోడీ వైపు ఇంట్రెస్ట్ గా ఉన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లుగా కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: