పొత్తుల కోసమే కేసీఆర్‌ ఆ ప్లాన్‌ రెడీ చేశారా?

2014 ఎన్నికల్లో కేసీఆర్ తక్కువ మార్కులతో గెలిచి, ఆ తర్వాత అందరిని కలుపుకుంటూ పోయి కొంత బలవంతుడు అయ్యారు. ఆ తర్వాత 2018 లో డైరెక్ట్ గా ప్రజల చేత భారీ మెజారిటీతో ఎన్నికై విజయం సాధించి పూర్తిగా బలవంతుడయ్యారు. ఆ సందర్భంగా సిట్టింగులు అందరికీ సీటు ఇస్తానని చెప్పారు. తాజాగా ఈ ఏడాదిలోనే అక్టోబర్లో లేదా నవంబర్లో ఎన్నికలు జరిగే వాతావరణం లో, మొన్న టిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం సమావేశంలో మాట్లాడిన కెసిఆర్ గారు ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి, పబ్లిక్ లో తిరగాలి, పల్లెనిద్రలు చేయాలి క్యాడర్  అసంతృప్తిగా ఉన్నారు, క్యాడర్ ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఇలాగైతే మీ తోకలు కత్తిరిస్తానంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇక్కడ తోకలు కత్తిరించడం అంటే సీట్లు ఇవ్వను అని చెప్పడం అని అర్థం వస్తుందని కొంతమంది అంటున్నారు.

అయితే గతంలో ఇస్తానన్న సీట్లు ఇప్పుడు ఇవ్వనని చెప్పడం వెనకాల ఒక కారణం ఉందని, అదేంటంటే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం ఏ విధంగా అయితే పొత్తుతో వెళ్లాలనుకుంటుందో అలాగే తెలంగాణలో కేసీఆర్ కూడా అదే విధంగా పొత్తుతో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. ఎలాగా మొన్న మునుగోడులో సక్సెస్ అయ్యారు కాబట్టి కమ్యూనిస్టులను కలుపుకునే ముందుకు వెళ్లాలని ఆయన అనుకుంటున్నారని తెలుస్తుంది. దీని ద్వారా బిజెపిని ఎదుర్కోవడం సులభం అవుతుందని ఆయన ఉద్దేశం అని తెలుస్తుంది.

ఇంతకుముందు కమ్యూనిస్టులు ఇంకా ఎంఐఎంలతో తెర వెనకే ఉండి పొత్తు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు తెర ముందే పొత్తు పెట్టుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే వాళ్ళు సీట్లు ఎక్కువగా అడుగుతున్నారని వాళ్ళకి ఇప్పుడు ఏడు ఉన్నాయని ఇంకా మూడు, నాలుగు  మొత్తం పది అడుగుతున్నారని తెలుస్తుంది. అలాగే కాంగ్రెస్ పార్టీతో కూడా ఒక పక్కన చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది‌ అలా అయితే దాన్ని కూడా ఒక 15-20 సీట్లు ఇవ్వాల్సి వస్తుందని అంటున్నారు. అందుకే ఇదంతా జరుగుతుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: