పోప్‌ సంచలన నిర్ణయాలతో క్రైస్తవంలో కలకలం?

పోప్ కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మహిళలకు ఎక్కువ గా అధికారాలు ఉండేవి కావు. 1960 నుంచి ఇప్పటి వరకు బిషప్ ల చర్చిలకు మహిళలకు  అనుమతి ఇవ్వడమే గొప్ప. అలాంటిది వాళ్లకి ఓటింగ్ హక్కు కు అనుమతి ఇచ్చారు. అయిదుగురు రిలీజస్ సిస్టర్స్ కు ఇలాంటి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 70 మంది నాన్ బిషప్ సభ్యులు ఉండేటు వంటి దీంట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రిస్టు, రిలిజియస్ సిస్టర్లు, ఆర్డినరీ మెంబర్లు ఇక్కడ ఉంటారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పొచ్చు.

క్రైస్తవ మత ఆచారాల్లో ప్రాన్సిస్ పోప్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సంచలనమైనవి. ముగ్గురు మహిళలతో కమిటీ వేశారు. ఇద్దరు నన్స్ ఒక లే ఉమెన్ ను తీసుకొచ్చారు. 2022 లో పురుష కమిటీల్లో మార్పులు తీసుకొచ్చారు. సెకండ్ వాటికన్ సిటీ లోని గవర్నర్ పదవిని సిస్టర్ రఫెలా పెతనికీ ఇచ్చారు. పొజిషన్ వ్యవహరాలు చూసే బాధ్యతను నెథలి కి ఇచ్చారు. పాస్లర్లుగా పెళ్లయిన వారిని అనుమతించారు. ప్రస్తుతం తాజాగా పోప్ ప్రాన్సిస్ మహిళలకు సమ ప్రాధాన్యం హక్కు కల్పించాలని భావిస్తున్నట్లు చెప్పారు.

వాటికన్ లో మహిళలు స్వేచ్ఛగా పని చేసుకునే విధంగా అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. చివరకు స్వలింగ సంపర్కులకు కూడా అవకాశం ఇస్తామని చెప్పారు. ముస్లింలు, క్రిస్టియన్లలో ఇంతవరకు స్వలింగ సంపర్కులకు అసలు విలువ ఉండేది కాదు. అలాంటిది పోప్ మాట్లాడుతూ..  స్వలింగ సంపర్కులకు అవకాశాలు కల్పిస్తామని అన్నారు. ఇంతకు ముందు స్వలింగ సంపర్కులపై ఇక్కడ నిషేధం ఉండేది. ఇప్పుడు దాన్నిఎత్తేశారు.

పోప్ ప్రాన్సిన్ తీసుకున్న ఈ నిర్ణయాలు సంచలనం కలిగించినా కాలంతో మాటు మారాల్సిందే. మార్పును ఆహ్వానించాల్సిందే. ప్రతి రంగంలో మహిళలు దూసుకుపోయి.. మగవారితో సమానంగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదే.  అన్ని రంగాల్లో హక్కులు కల్పిస్తేనే సమాజంలో సమానత్వం అనేది మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: