వివేకా హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు?

వివేకా హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అని పేర్లు వచ్చాయి. ఈ మధ్య అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ తర్వాత సునీత, రాజశేఖర్ లను సీబీఐ పిలిచి ప్రశ్నించింది. అనంతరం కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి కొత్త విషయాలను మాట్లాడారు. ఇంకో వైపున కొత్త కోణాలను టచ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

వాస్తవంగా రెండు రకాల దర్యాప్తు ఇప్పటికే  పూర్తయింది. ఒకటి సుభాసింగ్ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో మర్డర్ చేసిన వారిని వీళ్లే అని తేల్చేశారు. అనంతరం అరెస్టు కూడా చేసేశారు. వారి దగ్గర రిపోర్టులు కూడా తీసుకున్నారు. తర్వాత అరెస్టు అయిన వారిని ఢిల్లీ, ముంబాయిలకు రాంసింగ్ అనే సీబీఐ అధికారి తీసుకుపోయారు. దస్తగిరిని అప్రూవర్ గా మార్చి వెనక్కి తీసుకొచ్చారు.

అనంతరం అనేక పరిణామాలు జరిగాయి. ఎప్పుడూ మాట్లాడని అవినాష్ రెడ్డి  కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం.. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ లు అరెస్టు తో ఈ కేసు కీలక మలుపులు తీసుకుంది. దీంతో అవినాష్ రెడ్డి కూడా జైలుకు వెళుతున్నాడనే ప్రచారం విస్తృతంగా సాగింది. ముందస్తు బెయిల్  అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు తిరస్కరించడం, పులివెందులకు సీబీఐ రావడం, వైఎస్ షర్మిల వివేకా కూతరు సునీతకు అండగా ఉండటం లాంటి ఎన్నో చిక్కుముడులు దాగి ఉన్నాయి.  

కేసు కీలక దశకు వచ్చిన సమయంలో వివేకా కూతురునే  సీబీఐ ప్రశ్నించింది. మొన్నటి వరకు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి లే నిందితులు అన్నారు. కాదు ఆస్తి కోసమే కూతురు హత్య చేయించిందనే ఆరోపణలు రావడం. కాదు ఆస్తి మొత్తం సునీత పేరనే ఉందని షర్మిల మాట్లాడటం ఇలా ఎవరికీ అంతు పట్టకుండా ఈ కేసు తయారైంది. సీబీఐ అధికారుల అసలు నిందితులు ఎవరనేది ఎప్పుడూ తేలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: