వైసీపీ: దేశంలోనే సంచలనం సృష్టించబోతోందా?

దేశంలో అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే పార్టీల్లో వైసీపీ ఒకటని జాతీయ మీడియా అయిన టైమ్స్ నౌ ఇటీవల చేసిన సర్వేలో తేలింది. దేశంలో మూడో అతిపెద్ద పార్టీగా వైసీపీ అవతరించబోతుందని చెప్పింది. దేశంలో 24 ఎంపీ స్థానాలను గెలుచుకుని మూడో స్థానంలో నిలుస్తుందని పేర్కొంది. దీంతో వైసీపీ పార్టీ లో ఎక్కడ లేని ఆనందం నెలకొంది.

వైసీపీ పార్టీ ఇప్పటికే ఎమ్మెల్సీ స్థానాలను కోల్పోయి నిరాశలో కూరుకుపోయిన సమయంలో టైమ్స్ నౌ ప్రకటించిన ఈ సర్వే ఫలితాలు కార్యకర్తలకు, నాయకులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందనే విషయంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలు బీజేపీ గెలుచుకుంటుందని ప్రకటించింది. దాదాపు 292 స్థానాలను గెలుచుకుని బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది.బీజేపీ తర్వాత కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు 105 స్థానాలు గెలుచుకుంటుని చెప్పింది.

తృణమూల్ కాంగ్రెస్ దాదాపు 20 స్థానాలు, బీజూ జనతా దల్ 10 నుంచి 12 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే లో చేసిన వివరాలను ప్రకటించింది. అంటే బీజేపీ, కాంగ్రెస్ మిత్రపక్షాల తర్వాత దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలిచే పార్టీ మాత్రం ఇదేనని తెలిపింది. దీంతో వైసీపీ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. కానీ టీడీపీ ఈ సర్వే ఫలితాలను కొట్టి పారేసింది. టైమ్స్ నౌ చేసిన సర్వే ఏ మాత్రం విశ్వసనీయత లేనిదిగా అభివర్ణించింది. ఎందుకుంటే రాష్ట్రంలో మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత టీడీపీ కి మంచి ఊపు వచ్చింది.

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని చాలా మంది ధీమా గా ఉన్నారు .అయితే టైమ్స్ నౌ చేసిన సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే గెలిచే పార్టీల పేర్లను మాత్రమే చెప్పింది. కానీ ఇంకా ఎన్నికలకు ఏడాది సమయం ఉంది. దీని వల్ల అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో కానీ ఇప్పుడు మాత్రం వైసీపీ ఖుషీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: