వివేకా హత్య కేసు: జగన్ సాక్ష్యం చెబుతారా?

ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్ వాంగ్మూలం ఇస్తారా లేదా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి అఫిడవిట్ వేస్తారా అనేది కీలకంగా మారింది‌. భాస్కర్ రెడ్డి ఆయన కొడుకు అవినాష్ రెడ్డి ఇద్దరు కలిసి వైయస్ వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి గల కారణాల గురించి సిబీఐ చెప్పేది ఏంటంటే ఎంపీ టికెట్ ను  వివేకానంద రెడ్డి  తనకు లేదా షర్మిల కి లేదంటే విజయమ్మకి, ఇలా కుటుంబంలో వాళ్లకే తప్ప అవినాష్ రెడ్డికి ఇవ్వద్దని చెప్పారని అందుకు ఆ మాట నచ్చని అవినాష్ రెడ్డి ఇంకా భాస్కర్ రెడ్డి ఈ మర్డర్ చేయించారని సిబిఐ వాళ్ళ అభియోగం.

దీనికి వైఎస్సార్సీపీ చెప్పేది ఏంటంటే అప్పటికే అవినాష్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, తిరిగి ఆయనకే టికెట్ గ్యారెంటీ అనుకుని జమ్మలమడుగు గెలవడంలో తప్పుగా మారిందని అక్కడ వివేకానంద రెడ్డిని ఇన్చార్జిగా వేసామని అది చెప్తుంది. ఆ విషయం నిజమేనని అయితే జమ్మలమడుగు వెళ్లిన వివేకానంద రెడ్డి అవినాష్ రెడ్డి ఎంపీ అవడం ఇష్టం లేక అక్కడ మిగిలిన పార్టీ కార్యకర్తలతో మీరు అవినాష్ రెడ్డికి కాకుండా పార్టీకి ఓటు వేయండి అయితే నేను ఎంపీ అవుతాను లేదా షర్మిల ఎంపీ అవుతుంది అని చెప్పడంతో, అప్పటికే కోపంగా ఉన్న వీళ్ళిద్దరూ తర్వాత రోజు ఎంపీ టిక్కెట్ అధికారకంగా ప్రకటన వస్తుంది అని తెలిసి అది వివేకానంద రెడ్డి కే వస్తుందని అనుకుని ఆ రాత్రికి రాత్రే మర్డర్ చేయించినట్లుగా తెలుస్తుంది.

ఇప్పుడు ఇక్కడ జగన్ చెప్పబోయే విషయమే కీలకం కాబోతోంది. టిక్కెట్ ఇచ్చే అధికారం జగన్ దే కాబట్టి ఆయన అసలు వివేకానంద రెడ్డికి ఇవ్వాలనుకున్నారా లేదంటే షర్మిలకు ఇవ్వాలనుకున్నారా అనేది ఆయనే చెప్పాలి, కానీ ఇక్కడ సిబిఐ అడిగేది ఆ రూట్లో కాదు. సిబిఐ అందర్నీ అడుగుతుంది కానీ జగన్ ని గాని, టిక్కెట్లు ఇచ్చే కమిటీని గాని అడగడం లేదని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: