ఘరానా: 1600 కేజీల గోల్డ్‌.. ఇలా కొట్టేశారు?

కెనడా పియర్సన్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో 1600 కిలోల బంగారం చోరీ కి గురయింది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా..  అది నిజమేనని తెలుస్తోంది. వందల మంది భద్రత, కొన్ని వందల సీసీ కెమెరాలు, పటిష్టమైన భద్రత మధ్య ఎయిర్ పోర్టు నిర్వహణ ఉంటుంది.

కానీ కెనడా దేశంలోని చరిత్రలోనే అతిపెద్ద చోరీగా ఇది నిలుస్తోంది. దాదాపు 14.8 మిలియన్ డాలర్లు విలువ చేసే బంగారాన్ని టోరంటో రాజధాని పియర్సన్ ఇంటర్నేషనల్ లో చోరీకి గురి కావడం అక్కడి పోలీసులతో పాటు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్లు ఈ కేసును ఇన్విస్టిగేషన్ చేస్తున్న పోలీసు అధికారి స్టీపెన్ డ్యువెస్టియెన్ తెలిపారు. గురువారం సాయంత్రం టోరంటో ఎయిర్ పోర్టుకు వచ్చిన కార్గో ప్లైట్ నుంచి బంగారం  ఏకంగా బంగారం కంటైనరే చోరీకి గురైనట్లు పోలీసులు ప్రకటించారు.

ట్రక్ లో దీన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. అతి పెద్ద చోరీగా దీన్ని భావిస్తున్నారు. ఇది ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పని కాదని ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తీసుకువస్తున్న విషయం చాలా కొద్ది మందికే తెలుస్తుంది. ఎక్కడికి బంగారం వస్తుంది. ఎప్పుడు దాన్ని ఎత్తుకెళ్లాలి. ప్రతి విషయాన్ని దొంగతనం చేయాలనుకున్న వారు ప్రణాళిక ప్రకారం.. చేసినట్లు తెలుస్తోందని పోలీసులు ప్రకటించారు.

అయితే ఈ బంగారాన్ని షిప్పుల ద్వారా బయట దేశాలకు పంపించాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ బంగారం దేశం విడిచి పోలేదని చెప్పారు. కచ్చితంగా దొంగతనం ఎలా జరిగింది. ఎవరూ చేశారనే కోణంలో ప్రతి విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇంత పెద్ద దొంగతనం అది ప్రపంచ స్థాయి ఎయిర్ పోర్టులో జరగడం అక్కడి పోలీసులకు నిజంగా ఛాలెంజ్ విసిరినట్లయింది. భద్రత పరంగా కెనడాా  పియర్సన్ ఎయిర్ పోర్టు డొల్లతనాన్ని దొంగలు ఎత్తి చూపినట్లయింది. కెనడా చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఇది అతి పెద్ద ఎయిర్ పోర్టులో దొంగతనంగా నిలుస్తుందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: