అమెరికాలో చైనా అరాచకం.. మామూలుగా లేదుగా?

చైనా ప్రపంచ దేశాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.  ఈ సేవా కేంద్రాల లక్ష్యం ఎంటంటే విదేశాల్లో ఉన్న చైనా పౌరులకు సంబంధించి వీసా కష్టాలను తీర్చడం. డ్రైవింగ్ లైసెన్సులు తీసి ఇవ్వడం లాంటి పనులు చేయడం.  పాస్ పోర్టు లు రెన్యూవల్ చేయడం. ఇది వివిధ దేశాల్లోని ఎంబసీల్లో ఇలాంటి పనులు చైనా చేస్తోంది.

అయితే దీని వెనక కథా కమామిషు వేరే ఉంది.  చైనాలో కొంతమంది సిబ్బంది ని పెట్టి వేరే దేశాల్లో చైనా పోలీస్ స్టేషన్లను నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదే చైనా వివిధ దేశాల్లో ఉన్న చైనా పౌరులు పీపుల్స్ ఆర్మీకి సంబంధించిన దౌత్య అధికారులు అన్ని గమనిస్తారు. చైనాలో ప్రజాస్వామ్యం కావాలని పోస్టులు పెట్టే వారిని గుర్తించడం, హంకాంగ్ గురించి అనుకూలంగా పోస్టులు పెట్టే చైనా పౌరులెవరూ, చైనాలో ఏదైనా ఉద్యమాలు చేయాలని పోస్టులు, పెడుతున్న వారిని ఆయా కార్యాలయాలకు పిలిపించడం.

ఏ మాత్రం చైనాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా వారిని వెంటనే ఆఫీసులకు పిలిపించి వార్నింగ్ ఇస్తారు. మరోసారి ఇలాంటి వ్యతిరేక పోస్టులు పెడితే ఇక మీ సంగతి అంతే అని హెచ్చరిస్తారు. ఇలాంటి ఆనఫీషియల్ పోలీస్ స్టేషన్ ను ఏకంగా అమెరికాలోనే చైనా పెట్టేసింది. అమెరికాలోని మన్ హట్టన్ ప్రాంతంలో ఏఫ్ బీఐ దర్యాప్తు సంస్థ సీక్రెట్ గా  గుర్తించింది.

చాలా రోజుల నుంచి  చైనా చేస్తున్న పనిని ఓ కంట కనిపెట్టి దీని పూర్వా పరాలను పరిశీలించింది. అమెరికాలోనే చైనా ఒక పోలీస్ స్టేషన్ ను తెరిచిందంటే ఎంతటి కుట్ర పన్నిందో తెలుస్తోంది. చైనాలో నే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న చైనా పౌరులు ఎవరూ కూడా ఆ ప్రభుత్వాని గురించి ఒక్క వ్యతిరేక మాట అనకూడదంటే ఎంతటి రాచరిక పాలన కొనసాగుతుందో అర్ధం చేసుకోవచ్చు. మరి మన కమ్యూనిస్టు పార్టీలు ఇలాంటి వాటిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: