పంజాబ్ సైనిక స్థావరం దాడి.. గుట్టు వీడింది?

పంజాబ్ బటిండ సైనిక స్థావరంలో జరిగిన దాడిలో నలుగురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి వెనక ఉగ్రవాదులు ఉన్నారనే ఊహగాహనాలు బయటకు వచ్చాయి. దీంతో ఇండియన్ ఆర్మీ విచారణ చేపట్టింది. సైనిక స్థావరంపై దాడి ఘటనలో ఉగ్ర వాదుల దాడి కాదని తేల్చి చెప్పింది.

నలుగురు సైనికులను కాల్చి చంపింది తోటి సైనికుడు మోహన్ దేశాయ్ అని ఆర్మీ అధికారులు తెలిపారు. ముందుగా ఉగ్రకోణంలో విచారించిన అధికారులు తర్వాత అనుమానితుడైన మోహన్ దేశాయ్ ని విచారించారు. ఇలా విచారించిన సమయంలో మొదట కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నించిన మోహన్ అనంతరం తాను చేసిన పనిని ఒప్పుకున్నాడు.

ఎవరినైతే నలుగురు సైనికులను చంపాడో వారు తనను ఎప్పుడూ వేధించేవారని పేర్కొన్నారు. దీంతో వారిని చంపాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. నలుగురు సైనికులను చంపిన ఆయుధాలు కూడా క్యాంపు నుంచి దొంగిలించినట్లుగా గుర్తించారు. ఈ కేసులో మోహన్ దేశాయ్ ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. మోహన్ ఇంకా పెళ్లి కూడా కాలేదని చెప్పారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిన ప్రకారం ఇద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కానీ ఇక్కడ ఒక్కడే దొరికాడు. మొదట పోలీసులను బురిడీ కొట్టించడానికిి మోహన్ అబద్దాలు చెప్పాడన్నారు.

అయితే ఆర్మీ అధికారుల్లో సమన్వయ లోపం, స్నేహ భావం లోపించడమే దీనికి కారణంగా తెలుస్తోంది. గతంలో కూడా తోటి ఆర్మీ సైనికులను కోపంతో చంపుకున్న సంఘటనలు జరిగాయి. శిక్షణలో ఇస్తున్న నైపుణ్యాలకు తోడు మానవతావాద దృక్పథాలు పెంపొందించుకునేలా ప్రేమతో ఉండేలా ఆర్మీ అధికారులకు శిక్షణ ఇవ్వాలి. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడని జవాన్లు ఇలా చిన్న పాటి ఘర్షణలో ప్రాణాలు కోల్పోవడం చింతించాల్సిన విషయమే. ఈ దాడి చేసిన జవాన్ మానసిక పరిస్థితిని కూడాా పరిశీలించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: