ఇంటర్నేషనల్‌ మీడియాలోనూ యోగి ఎన్‌కౌంటర్స్?

అమెరికా లో ఈ మధ్య కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ పర్యటించారు. అయితే అక్కడ ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు మంత్రి ధీటైన సమాధానం చెప్పారు. నిర్మల సీతారామన్ ను ఇండియా లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. ఎక్కువగా జరుగుతున్న దాడుల వల్ల ముస్లింలలో అభద్రతా భావం నెలకొంది అని ప్రశ్నలు అడిగాడు.

దీనికి సమాధానంగా నిర్మల సీతారామన్ మాట్లాడుతూ.. ఇండియా లో ఉండే ముస్లింలు మైనార్టీలుగా పిలవబడుతున్నారు. కానీ ఇండియాలో ముస్లింలు చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం అందరితో సమానంగా జీవిస్తున్నారు. ఎక్కడ కూడా ముస్లింలపై వివక్ష లేదు.

కానీ పాకిస్థాన్ లో హిందువులు ఎంత మంది ఉన్నారు. అయినా వారికి ఎలాంటి హక్కులు ఉండవు. మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతాయి. పాకిస్థాన్ ను ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకున్నారు. అలాగే అప్గానిస్థాన్ లో కూడా ఇలాంటి దారుణాలే జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో కూడా మైనార్టీలుగా ఉన్న హిందువులపై హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇవేవీ మీకు కనిపించవు అని అన్నారు.

పాకిస్తాన్ లో ఉన్న ముస్లింల కంటే ఇండియాలోనే ముస్లింలు భద్రతాపరంగా, ఆర్థికపరంగా అన్ని విధాలుగా మెరుగ్గా జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. అతీక్ అహ్మద్ లాంటి వ్యక్తి హత్యను భూతద్దంలో చూపిస్తున్న అంతర్జాతీయ మీడియా అతడు ఎన్ని హత్యలు చేశాడు. ఎంతమంది స్థలాలను లాక్కున్నాడు. ఏ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడనే వివరాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైంది కాదు. అతీక్ అహ్మద్ అతని కొడుకులు ఉత్తరప్రదేశ్ లో రౌడీయిజం, గుండాయిజం పెంచి పోషించారు.

అలాంటిది వారికి మద్దతుగా కొన్ని విదేశీ మీడియా సంస్థలు, విదేశీయులు కామెంట్లు చేస్తున్నారు. అతీక్ అహ్మద్ దాదాపు 1000 కోట్ల కు పైగా ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఇది కేవలం అధికారికంగా తెలిసిన విషయమే. కానీ అనధికారికంగా అంతకు పది రేట్ల కు పైగా బినామీల పేర ఆస్తులున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: