బాబోయ్‌.. రష్యా అందరిని వణికిస్తోంది?

రష్యాలో ప్రస్తుతం అన్ని దేశాల కంటే ధరల పెరుగుదల తక్కువగా ఉండడం అమెరికాను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కారణం గత ఏడాదిన్నరగా యుద్ధంతో ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. రష్యాను ఏకాకిగా చేయాలని అమెరికా యూరప్ దేశాలు తీవ్రమైన చర్యలకు దిగాయి. ఆర్థికపరమైన ఆంక్షలు  పెట్టాయి.

బ్యాంకుల్లో లావాదేవీలను ఆపేశాయి. ప్రధాన సంస్థలైన గూగుల్ లాంటి వాటిని నిలుపుదల చేశాయి. అయినా రష్యా అధ్యక్షుడు పుతిన్  ఏ మాత్రం వెరవకుండా అమెరికా చేస్తున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా ముందుకు సాగాలో నిర్ణయించుకున్నారు. ఆ సమయం లో అమెరికాకు ప్రపంచ దేశాలు వత్తాసు పలికిన రష్యాను ఒంటరిగా చేయాలని చూసినా కూడా ఎక్కడ పుతిన్ ధైర్యం కోల్పోలేదు.

కచ్చితంగా యుద్ధంలో గెలవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో రష్యా ఒంటరిగా ఉన్న ప్రస్తుతం దానికీ మద్దతు పెరుగుతుంది. చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ లాంటి దేశాలు ప్రత్యక్షంగా మద్దతిస్తున్నాయి. భారత్ కూడా మొదటి నుంచి రష్యా దగ్గర ఆయిల్ ను తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ దానికి ఆర్థికపరంగా అండగా నిలిచింది. నిజం చెప్పాలంటే రష్యా వైపు భారత్ మొదటి నుంచి ఉందనే చెప్పొచ్చు.  ప్రస్తుతం ఆఫ్రికా దేశాలు  సైతం రష్యాను అనుసరిస్తున్నాయి. దానికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇది అమెరికా యూరప్ దేశాలకు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

యుద్ధంతో రష్యా ఆర్థిక పరిస్థితి  దిగజారుతుందని అందరూ అంచనా వేస్తే అక్కడ ద్రవ్యోల్బణం అంతగా ఏమీ పడిపోలేదు. ధరల పెరుగుదల కూడా నామమాత్రంగా ఉంది. కేవలం నాలుగు శాతం మాత్రమే ధరల పెరుగుదల ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం.  కానీ అదే అమెరికాలో ద్రవ్యోల్బణం ఆరు ఏడు శాతానికి పడిపోయింది. ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. యూరప్ లో సైతం అన్ని దేశాల్లో ధరల పెరుగుదల విపరీతంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రష్యా ఇంత యుద్ధంలో నూ మెరుగుపడటం అభినందించాల్సిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: