గుట్టురట్టు: ఉక్రెయిన్‌ వార్‌పై నాటో ప్లాన్స్‌ లీక్‌?

నాటో ప్లాన్స్ అంటూ కొన్ని డాక్యుమెంట్లు టెలిగ్రామ్, వాట్సాప్ లాంటి కొన్ని సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి. కానీ నాటో దాని మీద అవి మా ప్లాన్స్ కాదు రష్యా క్రియేట్ చేసి ప్రచారం చేస్తుంది అని చెప్తుంది. కానీ ఆ ప్లాన్స్ లో ఉక్రెయిన్ కి దశల వారీగా సహాయం చేయడమనే ప్రోగ్రాం, యుద్ధాన్ని  2ఏళ్ళు అయినా సరే‌ ప్రోలాంగ్ చేయడమనే ప్రోగ్రాం ఉన్నాయి.

ఇక్కడ రష్యా గెలవకూడదు, ఉక్రెయిన్ గెలవకపోయినా పర్లేదు. తద్వారా రష్యా ఆర్థిక సంక్షోభంలో ఉండాలి. రెండో పాయింట్ ఏంటంటే ఉక్రెయిన్ కి ఆయుధాలు తగ్గినప్పుడల్లా ఆయుధాలను ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఉక్రెయిన్ యుద్ధంలో లొంగిపోకూడదు రష్యాకి. మొన్న ఎలాగైతే సర్వనాశనం అయిపోయిన తర్వాత 20-30 ట్యాంకులు ఇచ్చి, 40-50 యుద్ధ విమానాలు ఇచ్చారో, ఇలా అయిపోయిన తర్వాత మళ్లీ ఇస్తుంది.

ఇలా దశలవారీగా ఇవ్వడమే నాటో ప్రణాళిక. అలా రష్యా వీకయ్యాక, ఇప్పుడు నాటు దేశాలన్నీ రష్యా బోర్డర్ లోకి వచ్చేసాయి కదా, పోలాండ్ గాని, స్లో వేకియా గాని ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు మిగిలిన వాటిని కూడా అందులో చేర్చుకుంటున్నారు కదా నాటో లో. అంటే ఇప్పుడు రష్యా సరిహద్దు అంతా నాటో దేశాలే ఉన్నాయి.
ఆ దేశాలు ఒక్కొక్కటిగా ముందుకు వచ్చి రష్యాను ఆక్రమించుకోవడం, ఎలాగంటే చైనా భారత దేశంలోని అరుణాచల్ ప్రదేశ్, లడాఖ్ లను ఏ విధంగా అయితే ఆక్రమించుకుందో అదే తరహా ప్లాన్ ఈ డాక్యుమెంట్ లో ఉంది.  ఈ విషయం ఇంతకీ ఆ డాక్యుమెంట్ లో ఉన్న విషయం, పైన చెప్పుకున్నదా కాదా అన్నది మాత్రం తేల్చుకోవాల్సి  ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా బాగా పాపులర్ గా ఉండడం వల్ల  ఏ విషయమైనా ముందు ఈ సోషల్ మీడియాలో త్వరగా పాపులర్ అయిపోతుంది, వైరలైపోతుంది  అది నిజమో అబద్ధమో తెలిసే లోగానే, ఆ నిజమో అబద్దమో దూసుకెళ్లిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: