ప్రపంచానికి పెనుముప్పుగా ముస్లిం ఉగ్రవాదం?

ఐసిస్ తీవ్రవాదుల లక్ష్యం ప్రపంచాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం. గతంలో ఐసిస్ ప్రధాన తీవ్రవాది ఆల్ బషీర్ ను అమెరికా చంపేసింది. దీంతో దానికి నాయకుడు చనిపోయాడు ఎవరూ లేరని ఇక ఐసిస్ కథ ముగిసినట్లేనని భావించారు. ఐసిస్ మళ్లీ ఉగ్రవాద దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

వీరి కన్ను ఇప్పుడు ఇండోనేషియా, పిలిప్పీన్ దేశాల పైన పడింది. ఇండోనేషియాలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అక్కడ నాన్ ముస్లింలను చంపేస్తామని, పోలింగ్ స్టేషన్లను పేల్చేస్తామని హెచ్చరికలు పంపారు.  ఐసిస్ శత్రువుల కింద అక్కడి ఎన్నికలను, పోటీ చేసే వ్యక్తులను, నాన్ ముస్లింలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.

జేఏడీ జమా ఆన్షాద్ డోలా అనే పేరుతో ఐసిస్ అనుబంధ విభాగం. ఇండోనేషియాలో 2015 నుంచి పనిచేస్తున్నట్లు దీని కింద 24 సంస్థలు కూడా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముజాహిదీన్ ఇండోనేషియా టిమార్ అనే సంస్థ కూడా ఇప్పుడు వీళ్లతో కలిసి పనిచేస్తోంది. 13 ఎటాక్ లు చేసి 128 మందిని కూడా ఈ ఉగ్రవాద సంస్థ మట్టుబెట్టింది. కాలిపట్ లో ఐసిస్ లో ఓడిన తర్వాత కొంత తగ్గిన మళ్లీ ఉగ్రవాదం జడలు విప్పుకొని మళ్లీ దాడులు చేసేందుకు ముందుకు వస్తోంది.

2021 లో పిలిప్పీన్ లో ఐసిస్ ఈస్ట్ ఆసియా లో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం ద్వారా సానుభూతిపరులను చేర్చుకుంటోంది. సౌత్ ఈస్ట్ ఆసియాకు కూడా ఈ ఉగ్రవాద సంస్థ ఎంట్రీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఐసిస్ అనే ఉగ్ర వాద సంస్థ గతంలో అప్గానిస్తాన్ లో కూడా చాలా దాడులు చేసింది. పాక్ లో కూడా బాంబు దాడులు చేసి తీవ్ర నష్టాన్నే మిగిల్చింది. ఐసిస్ ను ఆదిలోనే ఆయా దేశాలు తుంచేయకపోతే ఇండోనేషియా, పిలిప్పీన్ దేశాల భవిష్యత్తుతో పాటు ఇతర దేశాలకు తీవ్ర ముప్పుగానే పరిణమిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: