ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

వైయస్సార్సీపీకి షాకిస్తూ మూడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీట్ చేసేసింది తెలుగుదేశం. దీని వెనకాల సహకరించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనుకుంటాం లేదంటే పవన్ కళ్యాణ్ సహకరించడం వల్ల అనుకుంటాం లేదంటే కమ్యూనిస్టులు అని అనుకుంటాం, మరొక రకంగా జగన్ అనుకుంటాం కానీ కాదట. దానికి నేనే కారణం అని ఒక వ్యక్తి క్లైమ్ చేసుకుంటున్నాడు.

గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు తెలుగుదేశం  గెలిచిందని, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో తెలంగాణలో బిజెపి గెలిచిందని ఈ ఈ ఫలితాలను ప్రజాశాంతి అధ్యక్షుడిగా ఎలా విశ్లేషిస్తారు అంటే కే.ఏ.పాల్ గారు దానికి ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. కే.ఏ.పాల్ మాట్లాడుతూ చెట్లు లేని చోట్ల ఆముదాల చెట్లే మహా వృక్షాలని, మేము ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో కంటెస్ట్ చేయకపోవడం వల్ల మాత్రమే వాళ్లు గెలిచారని తేల్చేశారు ఆయన.

అంటే కే.ఏ.పాల్ గారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల మాత్రమే మిగిలిన వాళ్ళు ఆయా ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నారని ఆయన వ్యాఖ్యలకు అర్థం అని తెలుస్తుంది. అయితే ఇక్కడ కొంతమంది ప్రశ్న ఏంటంటే ఇన్ని తెలిసిన ఆయన తాను పోటీ చేస్తే మిగిలిన వారు కన్నా తానే గెలుస్తానని తెలిసిన ఆయన, ఎందుకు పోటీ చేయలేదు, ఆయనని పోటీ చేయకుండా ఎవరు ఆపారు అని కొంతమంది సందేహం.

మరి ఆయన మాటల్లో నిజం ఉందా! నిజంగా ఆయన పోటీ చేస్తే వీళ్ళు ఆ ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలుచుకోలేరా అంటే అదంతా ఆయన అపోహ మాత్రమేనని, నిజానికి అలాంటిదేమీ లేదని, ఆయన మాట్లాడిన మాటలను ప్రజలు గాని, గెలిచిన ఆయా పార్టీలు గాని సీరియస్ గా పట్టించుకున్నట్లుగా ఎవరు కనపడడం లేదు. వాళ్ళు ఆయన మాటలను కేవలం హాస్యంగా మాత్రమే తీసుకున్నారని చాలామంది జనాలు భావన. ఇది కేవలం న్యూస్ చానల్లో ఎంటర్టైనింగ్ వార్తల కోసం మాత్రమే ఇదంతా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: