డేంజర్‌: ఆ దేశం నుంచి దారి తప్పుతున్న అణుబాంబులు?

ఏదైనా చిన్నా చితకా వస్తువు పోతే పోయిందిలే అని సర్ది పెట్టుకోవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా లిబియాలో అణ్వస్త్రాల తయారీలో ఉపయోగించే యురేనియం పోయిందట. ఈ ఉగ్రదేశాలైనటువంటి దేశాలతో ఇదే ప్రమాదం. అలాంటి దేశాల్లో ఒక దేశమైన పాకిస్తాన్ కి కంట్రోల్ లేదు. తాను అణ్వస్త్ర దేశం అని చెప్పుకుంటుంది గానీ, అక్కడ ప్రభుత్వానికి  సైన్యం మీద కంట్రోల్ లేదు, సైన్యానికి ప్రభుత్వం మీద కంట్రోల్ లేదు, అలాగే రాజకీయాలకి సైన్యం మీద కంట్రోల్ లేదు, సైన్యానికి రాజకీయాల మీద కంట్రోల్ లేదు.

అణ్వస్త్రాలు గాని, అణ్వస్త్రాలకు సంబంధించిన రా మెటీరియల్ గాని వాళ్ళ చేతుల్లో ఉంటే రేపు పొద్దున్న ఏ తిరుగుబాటుదారుడు గానీ, టిటిపి లాంటి వాళ్ళు ఎవరైనా దాడికి వస్తే ఈ అణ్వాయుదాలనేవి వాళ్ళ చేతిలోకి వెళ్లిపోతాయి. ఆ తర్వాత వాళ్ళు ఇతర ఉగ్రవాద సంస్థలకు అమ్ముకుంటే ఎంత ప్రమాదం. మొన్న అమెరికా వాడు వదిలేసి వెళ్లిపోయిన ఆయుధాలను వీళ్లు తీసుకోవడం వల్లనే కదా కాశ్మీర్లో గాని, కొన్ని దేశాల్లో గాని ఈ విధ్వంసాలన్నీ కూడా. అలాంటి పరిస్థితే వచ్చేస్తుంది.  

చెప్పాల్సి వస్తే పాకిస్తాన్ లో టిటిపి వాడుతున్న ఆయుధాలు కూడా అమెరికా వాళ్ళవే. రేపొద్దున్న అదే జరుగుతుంది. ఇప్పుడు లిబియా లో పరిస్థితి ఏమిటంటే అక్కడ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వాన్ని , అధికారకంగా ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వాన్ని టర్కీ గుర్తించింది. దానికి తిరుగుబాటు అయిన సైనిక అధికారి ప్రభుత్వాన్ని  అగ్ర రాజ్యాలు గుర్తించాయి.

ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి అణ్వాయుధాలు తయారుచేయగల సామర్థ్యం ఈ తిరుగుబాటుదారుల చేతుల్లోకి రావడం ప్రమాదం అయింది. ఐ.ఏ.ఈ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ సంస్థ ఏదైతే ఉందో అక్కడ, శుద్ధి అయిన యురేనియం పది రౌండ్లు ఆయుధాలు తయారు చేయగలిగిన 21/2టన్నుల యురేనియం రేడియో లాజికల్ థ్రెట్ ఉందో అది లిబియా నుండి మాయమైంది. గడాఫీ 2011లో మరణించిన తర్వాత లిబియా తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: