సీఎం సీటుపై కన్నేసిన పవన్‌.. బాబు గ్రీన్‌ సిగ్నల్‌?

పవన్ కళ్యాణ్ కోరుకుంటుంది ఏంటంటే తనకి ముఖ్యమంత్రి పదవి షేరింగ్ కావాలని. ఎందుకంటే ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి తెలుగుదేశం సిద్ధంగా లేదు కాబట్టి. రెండున్నర ఏళ్ళు ముఖ్యమంత్రి అనేది ఆ పార్టీ ప్రపోజ్ చేస్తున్నటువంటి కీలకమైన విషయం. కానీ ఇప్పటిదాకా చర్చలు జరగలేదు అంటున్నారు కాబట్టి నిజంగానే జరగకపోయి ఉండొచ్చు.

జరిగితే  పవన్ కళ్యాణ్ మీటింగ్ కి వచ్చిన జనాన్ని చూసిన తర్వాత టిడిపికి ఒక స్పష్టత రావాలి. లోకేష్ కి వస్తున్న జనంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ కి వచ్చే జనం ఎలా ఉంటారనే దానిపైన.  రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ ఒక్కడే ప్రచారకర్త. ఎందుకంటే వాళ్ళ అమ్మ, చెల్లి ఇప్పుడు తెలంగాణకే పరిమితం అయిపోయారు.  

ఇప్పుడు టిడిపికి వచ్చేటప్పటికి చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ తోడుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా కమ్యూనిస్టులు ఎలా ఉంటారు కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున జనాభా సమీకరణ వీళ్ళ అందరితో చూసుకుంటే హైయెస్ట్ పవన్ కళ్యాణ్ ఉంటారు. ఆ తర్వాత బాలకృష్ణ ఉంటారు ఆ తర్వాత మిగతావాళ్లు పార్టీ  గ్యాధిరింగ్ ఉంటుంది. బాలకృష్ణది వచ్చేటప్పటికి పార్టీ వాళ్ళు 70% ఉంటారు. ఆయన అభిమానులు 30% ఉంటారు.

పవన్ కళ్యాణ్ కి వందకి 80 మంది మామూలు వాళ్ళు ఉంటారు, 20 మంది పార్టీ వాళ్ళు ఉంటారు. అంటే పార్టీ వాళ్ళు అందరూ వస్తారు కానీ ఆ సంఖ్య పరిమితమని ఆయనే చెప్పారుగా ఆరున్నర లక్షలు క్రియాశీల కార్యకర్తలనేటువంటి విషయం. కాబట్టి మామూలు జనం కాకుండా ఎక్కువ మందే వస్తారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోరుకునేట్టుగానే ఆశేష జన వాహిని లక్షలాది మందే వచ్చారు. అంతమంది వచ్చినటువంటి సభ ద్వారా తెలుగుదేశానికి ఒక సంకేతం ఇవ్వడం అది ఏంటయ్యా అంటే రెండున్నర ఏళ్ల పదవి షేర్, హాఫ్ సీట్స్ అనే విషయం. ఇస్తారా లేదా అన్నది వాళ్ళ భవిష్యత్తు చర్చల మీద ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: