శభాష్‌ సుప్రీంకోర్ట్‌.. ఇకనైనా లాకప్‌ అరాచకాలు ఆగుతాయా?

పోలీస్ స్టేషన్లలోని లాకప్ రూంలలో సీసీ కెమెరాలను పెట్టాలని సుప్రీంకోర్టు 2018 లోనే తీర్పు నిచ్చింది. అయినా ఇప్పటి వరకు ఎందుకు పెట్టలేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివరాలు ఇవ్వాలని కోరింది.  సీబీఐ, ఎన్ఐఏ, ఈడీ లాంటి ఆఫీసుల్లో కూడా సెక్యూరిటీ కెమెరాలు పెట్టాలని సూచించింది. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలోని కారిడార్, ఎంట్రీ, ఎగ్జిట్, లాకప్ రూం, స్టేషన్ రిసిప్షన్ ఏరియా,సబ్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. దీనికి సంబంధించి నిధులను విడుదల చేయాలని చెప్పింది.  

అలాగే ఈ పనులను ఎలా చేస్తున్నారో 6 వారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది.  ఈ కెమెరాల్లో రికార్డు అయిన విషయాలను 18 నెలల పాటు భద్రపరచాలని చెప్పింది. పోలీస్ స్టేషన్లలో విచారణ జరిగే సమయంలో మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చర్యలు తీసుకోవాలంది. ఇండింపెండెంట్ ప్యానల్లలో సీసీ కెమెరాలను చెక్ చేయాలని సూచించింది. పంజాబ్ లోని పోలీస్ స్టేషన్ లో జరిగిన లాకప్ డెత్ కేసులో ఈ తీర్పును సుప్రీం కోర్టు వెలువరించింది.

హ్యుమన్ రైట్స్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గతంలో చెప్పిన తీర్పును ఇప్పటివరకు అమలు చేయకపోవడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 27 వరకు పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే సాధారణంగా థర్డ్ డిగ్రీ చేయడం తప్పే. కానీ హంతకులు, హత్యలు చేసిన వాళ్లని చేసిన తప్పు కాదు కదా.. అంత కొట్టినా నిజాలు చెప్పని వ్యక్తితో ఏ విధంగా నిజం చెప్పింగలరు.

ఒక వేళ సీసీ కెమెరాలను బేస్ చేసుకొని విచారణ జరపాలంటే నిందితులను వేరే చోటికి తీసుకెళ్లి కొట్టరని గ్యారంటీ ఏంటి? కాబట్టి కొన్ని విషయాల్లో జరిగిన సంఘటనలు బేరీజు వేసుకుని పూర్తిగా ఎవరిని ఏమీ అనవద్దంటే పోలీసులకు ఎవరు సహకరించరు. విచారణ సరిగా సాగదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: