ఉక్రెయిన్‌కు అమెరికా ఆ బాంబులు ఇస్తే.. అణుయుద్ధమే?

కార్గిల్ లో యుద్ధం గెలవడానికి ఆనాడు భారత్ కార్పేట్ బాంబులను వాడింది. దాదాపు ఒకే సారి వందల బాంబులను శత్రు సైన్యంపై వేస్తే కొన్ని పేలుతాయి. కొన్ని పేలవు. మరి కొన్ని అక్కడే పడి ఎవరైనా కాలు పెట్టినపుడు పేలి పోతాయి. ఇలా చేయడం వల్ల పాకిస్థాన్ సైన్యం తోక ముడిచింది. మళ్లీ బాంబులు లేకుండా చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం.

హైరిస్కు బాంబులు కావాలని ఉక్రెయిన్ అమెరికాను అడుగుతోంది. ఎంకె 31 క్లస్టర్ బాంబులను ఇవ్వాలని కోరుతోంది. కీయూలోని ప్రభుత్వ అధికారులు అమెరికా లోని బైడెన్ కు మేసేజ్ పంపారు. ప్రస్తుతం యుద్ధంలో చాలా వరకు వెనకబడి ఉన్నాం. ఇప్పటికే ఎంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రపంచ వ్యాప్తంగా క్లస్టర్ బాంబులను ఇప్పటికే నిషేధం విధించారు. ఈ బాంబులు అత్యంత ప్రమాదకరమైనవిగా భావిస్తారు. ఇవి ప్రస్తుతం అమెరికా వద్ద ఉన్నాయి. కానీ వాటిపై నిషేధం ఉంది. ఇవి దాదాపు అణు బాంబు లాంటివిగా పరిగణిస్తారు.

క్లస్టర్ బాంబు ఒక సారి కిందపడితే దాని ద్వారా వంద బాంబులు పేలుతాయి. ఆ ప్రాంతమంతా ఛిన్నాభిన్నాం అయిపోతుంది. విధ్వంసం మాటల్లో చెప్పలేని విధంగా ఉంటుంది. ఒక బాంబు విలువ వందల బాంబులతో సమానం. అయితే వీటిని ఇవ్వాలని ఉక్రెయిన్ కోరుతోంది. కానీ అమెరికా నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇవి ఇస్తే వీటిని వాడటం ఉక్రెయిన్ మొదలుపెడితే పుతిన్ ఊరుకుంటారా అంటే లేదనే చెప్పాలి.

ఉక్రెయిన్, రష్యా యుద్ధం క్లస్టర్ బాంబు గనక ఉక్రెయిన్ ఉపయోగిస్తే ఇక తారాస్థాయికి చేరుకుంటుంది. రష్యా కచ్చితంగా అణుబాంబును వేయడానికి వెనకాడదు. ఒక వేళ అణు బాంబు కనక ఉక్రెయిన్ పై పడితే చుట్టు పక్కలా ఉన్న యూరప్ దేశాలు మొత్తం నాశనం అవడం ఖాయం. వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు తయారైంది ఉక్రెయిన్ అధ్యక్షుడి తీరు. ఉక్రెయిన్ తీరు ఎటు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: