పీఓకేలోనూ తాలిబన్ పాలన నడుస్తోందా?

పీ.ఓ.కే లో హిందువులను తుద ముట్టించి లేదా మతం మార్చి ఇప్పటికే చాలామందిని ముస్లింలుగా మార్చారు. ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు. కైబర్ ఫక్తునా కావచ్చు, గిల్గి పట్టిస్తాను కావచ్చు, కాశ్మీర్ లో కావచ్చు ఇప్పుడు కొంతమంది మాత్రమే ఉంటూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ భాషలో చెప్పాలంటే మైనార్టీలు, మనకు మనవాళ్లు, ఇంకా చెప్పాలంటే కాశ్మీర్ వాళ్ళు. ఇప్పుడు ఒక కొత్త వ్యవహారం నడుస్తుంది.
 
పాకిస్తాన్ ఇంతవరకు అందర్నీ మార్చాలనుకున్నా ఇంకా కొంతమంది మిగిలిపోయారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ చేయాల్సిన పనిని పాకిస్తాన్ ని ద్వేషించే తెహ్రీన్ కి తాలిబాన్ ఈ పాకిస్తాన్ చేయాలనుకుంటుంది. ఆయా ప్రాంతాల మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి అక్కడ ఉన్న సైన్యాన్ని చంపేసి లేదంటే సైనికుల దగ్గర నుండి ఆయుధాలను లాక్కొని అక్కడ షరియా చట్టాల్ని అమలు చేసి అక్కడ కూడా తమ తాలిబన్ రాజ్యం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న మహిళలను చదువుకోకుండా, ఉద్యోగాలు చేయనివ్వకుండా, ఉపాధి లేకుండా కేవలం వంటింటి బానిసలుగా, కేవలం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడానికి మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసేందుకు రంగంలోకి దిగుతుందనేది తాజాగా ఆందోళన కలిగించే విషయం.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రభుత్వం పాఠశాలలకు ఆదేశాలను జారీ చేసింది, విద్యార్థులందరూ మరియు ఉపాధ్యాయులు హిజాబ్  ధరించాలని వారు ఆదేశిస్తున్నారు. అక్కడ ఉన్న స్కూల్లో సాధారణంగానే అన్ని మతాలవారు కలిసి ఉంటారు. అక్కడున్న స్టూడెంట్స్ లో హిందువులు, బౌద్ధులు, సిక్కులు ఉంటారు. అయితే వాళ్లందరూ  ఇప్పుడు హిజాబ్ ధరించాల్సిందేనంట.

కేవలం ముస్లిం మతం వాళ్లని మాత్రమే కాకుండా, అక్కడ ఉన్న అందరిని ముస్లింలుగా భావించి హిజాబ్ ధరింప చేయాలని, లేకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు అక్కడ. ఇంతకన్నా క్రూరం మరెక్కడ ఉండదు. కానీ మన దేశంలో ఉన్న లిబరల్స్ మాత్రం ఈ మాట ఒప్పుకోరనే వాదన ఉంది.. మన దేశంలో కూడా వాళ్ళ డామినేషన్ ఎక్కువైతే ఇలానే ఉంటుందేమో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: