పాకిస్తాన్‌కు షాక్‌ ఇస్తున్న తాలిబన్లు?

కాశ్మీర్ ను ముక్కలు చేస్తాం, ఈశాన్య రాష్ట్రాలని ముక్కలు చేస్తాం, పంజాబ్ ని ముక్కలు చేస్తాం అంటే, పాకిస్తాన్  తెర ముందు ఉండి చైనా తో వ్యూహాత్మకమైన గేమ్ ని నడుపుకుంటూ వచ్చింది. చైనా దగ్గర డబ్బు తీసుకొని, అమెరికా దగ్గర డబ్బు తీసుకుని తయారు చేసిన తీవ్రవాదులను భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోకి పంపించి వాటిలో మెజార్టీ ముస్లింలను ఏర్పాటు చేసి తద్వారా ఆ ప్రాంతాల మీద ఆధిపత్యం సాధించి అరాచకం చేయాలనుకుంది అది.

సరే.. దానిని అయితే కరోనా కారణంగా లేదా నోట్ల రద్దు కారణంగా నిరోధించగలిగాము. ఆ తర్వాత కీలకమైన సరిహద్దు ప్రాంతాలను రక్షించుకున్నాము. ఇప్పుడు పాకిస్తాన్ కి ఈ సమస్య వచ్చి పడింది. పాకిస్తాన్ తయారుచేసిన తీవ్రవాదులకు పెద్దన్న అయినటువంటి  తాలిబన్ల నేతృత్వంలో ఆఫ్గనిస్తాన్ ఇప్పుడు అక్కడినుండి తెహరీన్-కి-తాలిబన్-ఈ-పాకిస్తాన్ అనేటువంటి పిల్ల మూకను వీళ్ళ మీదకి యుద్ధానికి పంపించింది. దాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా అవ్వట్లేదు. అలాగైతే వాటి స్థావరాలు ఎక్కడ ఉన్నాయో చూడమని అడ్రస్ ఇచ్చింది పాకిస్తాన్.

మాకైతే కనిపించలేదని అంది ఆఫ్గనిస్తాను. అయితే మీరు వదిలేయండి మేము దాడి చేస్తామంది పాకిస్తాన్. మా సరిహద్దుల్లోకి మీరు వచ్చి యుద్ధం చేస్తే, మీ సరిహద్దుల్లోకి వచ్చి మేం యుద్ధం చేయాల్సి ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చింది ఆఫ్గనిస్తాన్. ఇప్పుడు టి.టి.పికి సంబంధించి అమెరికా గూఢచార వ్యవహారాల శాఖ, విదేశాంగ శాఖ పాకిస్తాన్ ను హెచ్చరించాయి.

ఏమనంటే టి.టి.పి ఒకప్పుడు నువ్వు అనుసరించిన విధానాన్నే అనుసరిస్తుంది. తాలిబన్లు వాళ్ళ వెనకాల ఉన్నారు. తాజాగా కైబర్ ఫక్తునా ప్రాంతంలో దారుణ అరాచకం చేస్తుందది. అక్కడున్న ముస్లిమేతరులను, గిరిజనులను కూడా చంపేస్తుంది లేదా మతం మారమంటుంది. వాళ్ళ అందరితో కలిపి షరియా చట్టం ప్రకారం నడిచే ప్రభుత్వాన్ని తనకు తానుగా  ప్రకటించాలనుకుంది. అంటే ఇప్పుడు ఆఫ్గనిస్తాన్ ను తాలిబాన్లు పరిపాలిస్తుంటే, టి.టి.పి కైబర్ ఫక్తునాని పరిపాలించబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: