ఉక్రెయిన్‌ యుద్ధం: మోదీ మాట.. పుతిన్‌ వింటారా?

జీ20 దేశాల సదస్సు ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశంలో రష్యా విదేశాంగ మంత్రికి భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఇది యుద్ధాలు చేసుకునే యుగం కాదని అన్నారు. ఉక్రెయిన్, రష్యాతో మాట్లాడి శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటే బాగుంటుందన్నారు. జీ 20 సదస్సులో ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉన్నట్లు భారత విదేశాంగ కార్యదర్శి చెప్పారు.

చర్చలు, దౌత్య మార్గం ద్వారా రష్యా, ఉక్రెయిన్ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. ఈ సమస్యపై జీ 20 సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. విదేశాంగ మంత్రులంతా ఆ పరిణామాలపై దృష్టి పెట్టనున్నారు. ఆహారం, ఇంధన, ఎరువుల ధరలు పెరుగుతున్న విధానంపై చర్చ జరిగే అవకాశం ఉంది. రెండవ అంశం ఉగ్రవాదం, మ్యాపింగ్, నార్కోటెక్, గ్లోబల్ మార్కెటింగ్ విధానాలపై మరో చర్చ జరగనుందని చెప్పారు. జీ 20 సభ్యులు కానీ సింగపూర్, నెదర్లాండ్, ఈజిప్టు ఓమన్, బంగ్లాదేశ్, నైజీరియా, యూఏఈ, మారిషస్ లాంటి దేశాలను కూడా ఈ సమావేశానికి పిలిచినట్లు చెప్పారు.

13 అంతర్జాతీయ సంస్థలతో పాటు 41 మందికి పైగా ప్రతినిధి బృందాలు రానున్నట్లు పేర్కొన్నారు. అయితే గతంలో జరిగిన జీ 20 సదస్సులు వేరు, ప్రస్తుతం జరగబోయే సదస్సుకు ఒక ప్రత్యేకత సంతరించుకోనుంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి మాట్లాడటం అనేది ఇక్కడ ప్రత్యేకత. అయితే ఈ సమావేశంలో స్వయంగా మోడీ పాల్గొన్నారు. ఆయన ప్రసంగం కోసం ఎదురు చూశారు.

అయితే గతంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ కు యుద్ధం వద్దని దౌత్య పరంగా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని మోఢీ సూచించారు. యుద్ధంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఎదురవుతున్న సమస్యల్ని ముందుగానే భారత్ పసిగట్టినా భారత్ మాటలను రష్యా ఏ మాత్రం పట్టించుకోలేదు. యుద్ధం చేయాలని నిర్ణయించుకుంది. కాబట్టి ఇప్పుడు ఏయే సమస్యలు వస్తున్నాయి. వాటిని ఎలా పరిష్కరించుకోవాలో జీ20లో చర్చించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: