అమెరికాను బోల్తా కొట్టించిన నిత్యానంద?

అమెరికా, యూరప్ దేశాలను మనం గొప్ప విద్యావంతుల దేశాలుగా భావిస్తూ ఉంటాం. కానీ వెర్రితనం కూడా వాళ్లకి అంతే ఉంటుందని ఇప్పుడు తెలిసింది. భారతదేశంలో అత్యాచార ఆరోపణలతో అమెరికా పారిపోయి అక్కడ ఒక ద్వీపాన్ని కొనుక్కొని, దాన్ని ఒక దేశంగా ప్రకటించుకుని, సొంత కరెన్సీని పెట్టుకుని, రజిత అనే హీరోయిన్ ని వెంటబెట్టుకుని పోయి అక్కడ కార్యకలాపాలు నడుపుతూ ఇంకో హీరోయిన్ ని కూడా అక్కడికి పట్టుకు పోతున్న వివాదాస్పద నిత్యానంద స్వామి కి సంబంధించిన ఒక ద్వీపంలా ఉన్న దేశాన్ని అమెరికా విచిత్రంగా ఒక దేశంగా గుర్తించింది.  

అమెరికా గుర్తించింది కాబట్టి ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది ఇది మరొక విచిత్రం. ఐక్యరాజ్యసమితి మీటింగ్ లో ఆ దేశం తరఫున ప్రాతినిధ్యం అనేది మరొక వింత. సాధారణంగా సినిమాల్లోనే జరుగుతుంటాయి ఇలాంటి విచిత్రమైన కామెడీలు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వివాదాస్పద స్వామీజీ నిత్యానంద దేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఐక్య రాజ్య సమితిలో పాల్గొంది.

ఆ దేశ ప్రతినిధి ఐక్యరాజ్యసమితిలో ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. నిత్యానందను భారత్ వేధిస్తుందని ఆమె ఆరోపించారు. ఆయనకు రక్షణ కల్పించాలని గత వారం జరిగిన సమావేశంలో విజయప్రియ నిత్యానంద హాజరయ్యి డిమాండ్ చేశారు. తన దేశం తరపు నుండి ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధినంటూ పరిచయం చేసుకున్నారు. కైలాస హిందువుల కోసం ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమత్వ దేశం. దీనిని నిత్యానంద పరమశివం స్థాపించారు. ఆయన హిందూ మత పునరుజ్జీవనం కోసం పాటుపడుతున్నారు అంటూ తన దేశం ఇంకా దేశాధినేత గురించి వెల్లడించారు.

ఈ దేశం నుంచి మరొక ప్రతినిధి ఇ.ఎన్.కుమార్ కూడా హాజరయ్యారు. కైలాస అనేది నిత్యానంద ప్రపంచం.‌ దానికి తనకు తాను ప్రధానిగా ప్రకటించుకున్నారు. డాలర్, రిజర్వ్ బ్యాంక్, జెండా ఇంకా పాస్ పోర్టును కూడా తీసుకొచ్చారు. అత్యాచారం ఆరోపణ తర్వాత 2019లో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఈ దేశాన్ని ప్రకటిస్తే వాళ్ళు ఎలా అనుమతించారో తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: