జగన్‌.. వాలంటీర్లను బలి చేస్తున్నారా?

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లపై ఉచ్చు బిగుస్తోంది.  26 మంది పెన్షన్ రాని వారు హైకోర్టుకు వెళ్లి అన్ని అర్హతలు ఉన్న మాకు పింఛను ఇవ్వడం లేదని కేసు వేశారు. 2750 రూపాయాలు రావడం లేదని హైకోర్టుకు వెళ్లి కేసులు వేసేంత శక్తి వారికి ఉందని ఎవరూ అనుకోవడం లేదు. అయితే వారి వెనకాల కావాలనే ఎవరో ఇలా చేయిస్తున్నారని తెలుస్తోంది.

అయితే హైకోర్టు దీనిపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గతంలో లబ్ధిదారులను గుర్తించేది ప్రభుత్వ ఉద్యోగులే కదా..  అలాంటపుడు ప్రస్తుతం వాలంటీర్ల మీద నెపాన్ని ఎలా వేస్తారు. 26 మందికి పెన్షన్ రాకపోవడానికి రాజకీయాలే కారణంలా అనిపిస్తున్నాయని పేర్కొంది.  వాలంటీర్ల పని ఇంటింటికీ వెళ్లి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి పేర్లను రాసి పంచాయతీలోని సెక్రటరీకి అందజేయాలి. అనంతరం లబ్ధిదారులకు ఇవ్వాలా వద్దా అనేది పై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. అంతే కానీ అన్నింటికి వాలంటీర్లనే బలి పశువులను చేయాలని అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అనుకుంటున్నారు.

వాలంటీర్లు కేవలం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి అనే విషయాన్ని ఇక్కడ మరిచిపోతున్నారు. వారు ఆయా గ్రామాల్లో దరఖాస్తులు చేయడానికి ప్రభుత్వ పథకాలు అర్హత ఉండి అందని వారి పేర్లను పై అధికారుల వరకు పంపడానికి మధ్య వర్తులుగా మాత్రమే పని చేస్తారు. అయితే ఇక్కడొక విషయం ఉంది. రాజకీయాలు చేయడం వల్ల కొంతమందికి సంక్షేమ పథకాలు దగ్గరకు చేరకపోవచ్చు. దానికి వాలంటీర్లను తప్పు పట్టడం ఏ మాత్రం సమంజసం కాదు.

ఆంధ్రప్రదేశ్ లో జగన్ తీసుకొచ్చిన ఈ వాలంటీర్ల వ్యవస్థ కాస్త మెరుగ్గానే పనిచేసినా అక్కడక్కడ ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.  ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల తీరుతోనే సమస్యలు పెరిగి పోతున్నాయి. ఏదైమైనా అధికార పార్టీకి మద్దతు లేకున్నా, ప్రభుత్వం అందించే పథకాలు అందరికీ చేరినప్పుడే ఆ పథకం యొక్క పనితనం మెరుగుపడిందని అనుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: