బాబు, జగన్, కేసీఆర్.. ఆ ముగ్గురూ కలిస్తే?

ఈ మధ్య జరిగిన కాంగ్రెస్ ప్లీనరీలో ఆ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగాలని కోరుకుంటున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఛత్తీస్ గడ్ లోని నయా రాయపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ ప్లీనరీ లో పాల్గొన్నారు.

అయితే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను ప్రజల నుంచి వేరు చేయలేరని అన్నారు. ప్రజల వద్దకు వెళ్లి మళ్లీ కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రాంతీయ పార్టీలతో కలవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీఎస్పీ, ఎస్పీ, అప్, డీఎంకే, లాంటి పార్టీలతో కలిసి నడిచి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను కేంద్రంలో అధికారంలో కి తేవడమే లక్ష్యంగా పని చేయొచ్చు.

ఇదే క్రమంలో బీజేపీ ఎలాంటి విధ్వంసమైన పనులు చేసింది ప్రజలకు తెలిసేలా చేయాలి. బీజేపీ దేశంలో చేస్తున్న ప్రైవేటీకరణ విధానాన్ని ఎండకట్టాలి. ఇన్ని ప్రాంతీయ పార్టీలు వాటి విధానాలతో కాంగ్రెస్ ఎలా నెట్టుకొస్తుందనేది ఇక్కడ అసలైన సవాల్. ఇప్పటికే దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ వెనకబడింది. మరి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెసును ఎలా కలుపుకుంటాయో చూడాలి. మరి కాంగ్రెస్ నాయకత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరిస్తాయా లేదా అనేది చూడాలి.

గత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 55 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇలాంటి సమయంలో  కాంగ్రెస్ తో స్నేహం లాభం చేకూర్చుతుందా లేక మరిన్ని ఓట్లు పోయేలా మారుతుందో తేలిక ఆయా పార్టీలు సతమతమవుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎవరిది జయమో ఎవరిది ఓటమో తేల్చేది ఓటర్లే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: