జగన్‌తో యుద్ధానికి ముందే చేతులెత్తేసిన బాబు?

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం మానేసింది. మరి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కూడా ఎందుకు పోటీలో నిలబడింది. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పోటీలో ఓడిపోతామని అంచనాలు ఉన్నా బరిలో ఉన్నారు. ఓడిపోతామనే తెలిసినా కూడా పోటీ చేయాల్సిందే. ప్రజాస్వామ్యంలో పోటీలో నుంచి పక్కకు తప్పుకుంటే పెద్ద పార్టీల పరువు పోయినట్లే. వైసీపీ పార్టీలోని సర్పంచులు, కార్పొరేటర్లు ప్రభుత్వ వ్యతిరేకత కనబరుస్తున్నారని టీడీపీ, జనసేన, సీపీఎం, సీపీఐ లాంటి పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి.

కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం పోటీ కూడా పెట్టలేరు. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో అసలు పోటీనే పెట్టలేరు. ప్రస్తుతం మూడు గ్రాడ్యుయేట్, 2 టీచర్ల కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన ఎన్నికలు. గతంలో బీజేపీ, టీడీపీ కలయిక వల్ల మాధవ్ గ్రాడ్యుయేట్ కింద ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

ఇప్పుడు ప్రస్తుతం స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. జనసేన మద్దతు ఇస్తామని చెబుతున్నా ఇప్పటి వరకు స్పష్టత కొరవడింది. గతంలో గ్రాడ్యుయేట్, టీచర్ల దాంట్లో ఇంతకుముందు పార్టీ పేర్లు చెప్పే వారు కాదు. తెర వెనక నుంచే మద్దతు కొనసాగేది. అప్పట్లో గుంటూరు ఏరియాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీచర్ ఎమ్మెల్సీ గెలుచుకుంది. కోస్తా, గోదావరి ఏరియాలో కమ్యూనిస్టులే గెలుపొందారు. ఈ దశలో టీచర్ల నుంచి ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉన్నా పోటీ చేయకుండా ఉండటానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.

గ్రాడ్యుయేట్ల దగ్గర 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఓట్లు ఉన్నాయి. కానీ టీడీపీ ఎలాంటి ఎఫర్ట్ పెట్టినట్లు కనిపించడం లేదు. వైసీపీ మాత్రం కాస్త ఈ వైపుగా కన్ను పెట్టినట్లుగానే ఉంది. మూడు జిల్లాల్లో చదువుకున్న గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లు పొందడానికి టీడీపీ మాత్రం ఎలాంటి కృషి చేసినట్లుగా కనిపించడం లేదు. వైసీపీ మాత్రం దూకూడుగానే దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: