అమెరికాకు షాక్‌.. రష్యాకు జైకొట్టిన దక్షిణాఫ్రికా?

అమెరికాకు ప్రపంచ దేశాలపై ఉన్నటువంటి పట్టు క్రమక్రమంగా పోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రచ్చన్న యుద్దం మొదలైంది. ఐక్యరాజ్య సమితి ఏ గ్రూపు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేసింది. యూఎస్ఎస్ నుంచి 16 దేశాలు విడిపోయాయి. రష్యా పెద్ద దేశంగా మిగిలిపోయింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుంది.  అమెరికా, యూరప్ దేశాలు రష్యాను ఏకాకిని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి.

దీన్ని సమర్థంగా అడ్డుకునేందుకు రష్యా కంకణం కట్టుకుంది. తనకు మద్దతిచ్చే దేశాలను తాను వెతుక్కుంటోంది. రష్యా మరో వైపు గ్రూపును తయారు చేసుకుంటుంది. చైనా, టర్కీ, ఇరాన్ లాంటి దేశాలు రష్యాకు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నాయి. దీనికి తోడుగా దక్షిణఫ్రికా కూడా రష్యాకు మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తోంది.

రష్యా, బెలారస్, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి మిలిటరీ డ్రిల్ నడుస్తోంది. స్మోక్ అనే పేరుతో హిందూ మహా సముద్ర జలాల ప్రాంతంలో ఆధిపత్యం కోసమే ఇవి కలిసినట్లు తెలుస్తోంది. దీని గురించి అమెరికా దక్షిణాఫ్రికాను హెచ్చరించింది. అయినా రష్యాతో బంధం తప్పదు అని దక్షిణాఫ్రికా అమెరికా తేల్చి చెప్పింది. ఇది కేవలం తమ జాతీయ భద్రత కోసమేనని వివరణ ఇచ్చుకుంది. అమెరికాతో ఉన్నటువంటి బంధాన్నిదక్షిణాఫ్రికా పక్కనబెట్టి ఒకప్పుడు సైనికపరంగా శిక్షణ ఇచ్చినటువంటి రష్యాతో ముందడుగు వేసేందుకే మొగ్గు చూపుతోంది.

దక్షిణాఫ్రికా తీసుకున్న నిర్ణయం సంచలనమే అని చెప్పొచ్చు. అమెరికాను కాదని రష్యాతో కలవడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ భారత్ కు ఒక సమస్య ఎదురుకానుంది. చైనా అల్రడీ జిబూటీలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాకు చేరువ కానుంది. మరి చైనాతో భారత్ కు పడదు. అయితే రష్యాతో భారత్ కు ఉన్న అనుబంధం వల్ల చైనాతో మనకు ఆఫ్రికా దేశాల్లో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. ఈ కలయిక వల్ల ఎలాాంటి పరిస్థితులు తలెత్తుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: