గొడ్డు మాంసం తింటానంటున్న బీజేపీ నాయకుడు?

దేశమంతా బీజేపీ ఇంకా సంఘ్ పరివార్ బీఫ్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉంటారు. నియంత్రణలు కూడా గీస్తూ ఉంటారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో అయితే హర్తాళ్లు చేస్తూ ఉంటారు. బీఫ్ ని రవాణా చేస్తున్నారనే అనే అనుమానం పైన, బీఫ్ ని ఇంట్లో పెడుతున్నారనే అనుమానం పైన కూడా చాలా సార్లు మూకదాడులు కూడా జరుగుతూ ఉంటాయి. చివరికి ఇదే బీఫ్ విషయంలో ప్రాణాలు కూడా తీస్తూ ఉంటారు. ఇలాంటి కేసులు మన చుట్టూ అనేకం జరుగుతూ ఉంటాయి.

భారతదేశంలో విద్వేషపూరిత దాడులకు, ప్రచారానికి బీఫ్ ఇప్పుడు ఒక పెద్ద ఆయుధంగా మారిపోయింది. కానీ మేఘాలయ రాష్ట్రంలో స్వయంగా ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎంఎస్ మావోయిస్టు, సరిగ్గా మేఘాలయాలో ఎన్నికలు జరిగే సమయంలో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేశారు. అది బీజేపీకి అసలు నచ్చని మాట . ఆయన మాట్లాడుతూ నేను బీఫ్ తింటాను ఎవరూ ఆపలేరు, మేఘాలయాలో ఇది ఒక లైఫ్ స్టైల్, ఇది మా జీవన విధానం, ఆ మాటకొస్తే భారతదేశంలో కూడా బీఫ్ తినకూడదనే విధానం ఏమీ లేదంటున్నారు.

మా మేఘాలయ రాష్ట్రంలో స్లాటర్ వేగన్స్ ఉంటాయి. అక్కడకు ఆవులను, పందులను కూడా తీసుకువెళ్తారు అంటూ ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడారు. ఎవరూ ఆపలేరు అని కూడా  అంటున్నారు. పక్కనే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి మేఘాలయతో సహా నార్త్ ఈస్ట్ మొత్తానికి ఇన్చార్జి హేమంత్ విశ్వాస్ శర్మ బీఫ్ పైన ఆంక్షలు పెట్టారు. అస్సాంతో పాటు మేఘాలయా కూడా నార్త్ ఈస్ట్ రాష్ట్రమే.

రెండూ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అయినా కూడా అస్సాంలోని లైఫ్ స్టైల్, మేఘాలయలోని లైఫ్ స్టైల్ ఒకటే అవ్వాలనే రూల్ ఏమి లేదు. ఎవరి ప్రాంతానికి సంబంధించిన ఆహార అలవాట్లు ఇంకా ఆచార వ్యవహారాలు వాళ్లకు ఉంటాయి. కానీ బీఫ్ కి వ్యతిరేకమైన బీజేపీలో ఉంటూ ఇలా వ్యాఖ్యలు చేయడం మాత్రం విడ్డూరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: