మార్చి నెలాఖరుకు ఉక్రెయిన్‌పై రష్యా విజయం?

రష్యన్ సైన్యం ఉక్రెయిన్ లోని డొనేట్స్కి , లుపాన్స్కి, జెపోరీజియా, కేర్సన్ ఇలాంటి ప్రదేశాల వైపుకు దాడికి వెళ్ళినా ఇంకా మరికొంత సైన్యాన్ని పంపించి దాడులు చేయాలనే ఉద్దేశంతో, దాదాపు మూడు లక్షల సైన్యంతో దాడికి సిద్ధంగా ఉంది. అలా వాళ్ళు ముందుకెళ్లిపోయాక ఇక కొత్త వాళ్లు ఎవరూ రాకుండా తెలివిగా వెనక ప్రాంతాన్ని అడ్డుపెట్టేసుకుంది ఉక్రెయిన్.

రష్యా యుద్ధం చేయడానికి సేఫ్ ప్రాంతమైన బాగ్పుత్ ప్రాంతం ఇంకా సారిడార్ ప్రాంతాన్ని బ్లాక్ చేసేసింది ఉక్రెయిన్. అది తెలుసుకుని అవే ప్రాంతాలని ధ్వంసం చేస్తుంది రష్యా. దాన్ని ఆక్రమించుకుందామని రష్యా ఎన్నిసార్లు దాడులు చేస్తున్నా ఉక్రెయిన్ మాత్రం ఆ ప్రాంతంలో బలమైన తన పట్టునైతే వదలటం లేదు. వ్యాగనార్ గ్రూప్ అయితే సంపూర్ణంగా ఉక్రెయిన్ సైన్యాన్ని తరిమేయడానికి మార్చి దాకా టైం పట్టవచ్చు అని చెప్తుంది.

ఈ సందర్భంగా బాగ్‌పుత్ ను మార్చి లేదా ఏప్రిల్‌లో మాత్రమే స్వాధీనం చేసుకోగలమని రష్యన్ ప్రైవేట్ మెర్సెనరీ గ్రూప్ వ్యాగనార్ యొక్క బాస్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా ఈ పోరాటంలో రష్యా సైన్యం లేదా వ్యాగనార్ గ్రూప్ రెండూ, వ్యూహాత్మక నగరమైన తూర్పు ఉక్రెయిన్ డొమెస్క్ ప్రాంతంలోని బాగ్పుత్ లో, తమ దేశ రక్షణ కోసం కర్తవ్య నిర్వహణలో నిమగ్నమైన ఉక్రెయిన్ సైనిక సమూహాలని తమ దారికి అడ్డు తొలగించుకుంటూ వెళ్లడం చాలా ముఖ్యమైన అంశం అని ఆయన అన్నారు.

వ్యాగనార్  ప్రైవేట్ సైన్యం కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రష్యా అధికారులు ఈ ప్రాంతానికి వెళ్లే ఆహారం, నీరు, గ్యాస్ ఇలా అన్నిటిని ఆపేస్తే గనక భాగ్పుత్ లోని ప్రజలు రోడ్లమీదకి వస్తే,  వాళ్ళందరినీ చంపేసి ఆ ప్రాంతాన్ని ఆక్రమించవచ్చని ప్లాన్. అలాంటి అనైతిక కార్యకలాపాలు చేస్తే ప్రపంచ దేశాలు రష్యాపై నిషేధం పెడతాయని తెలిసినా, వ్యాగనార్ గ్రూపు మాత్రం యుద్ధంలో గెలుపు ముఖ్యం కానీ అది నైతికమా, అనైతికమా అనేది అవసరం లేదు అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: