భారత్ మీద పడి ఏడుస్తున్న నాటో దేశాలు?

నాటో దేశాలు భారత్ పై కోపంతో ఊగిపోతున్నాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న తరుణంలో అమెరికా, యూరప్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని నిశ్చయించుకున్నాయి. రష్యా ప్రధాన ఆదాయ వనరైన ఆయిల్ కొనకపోతే యుద్ధం ఆగిపోతుందని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని భావించింది.

కానీ రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడంతో దానికి ఆదాయం రావడం జరుగుతోంది. నాటో దేశాలు భావించినట్లు జరగడం లేదు. అయినా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే అది ఇతర దేశాల మీద ప్రభావం చూపించేలా చేయడం అనేది అమెరికాకే చెల్లింది. ఈ యుద్ధాన్ని పరోక్షంగా నడిపిస్తున్న అమెరికా ఇండియాను రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని చెప్పలేకపోతుంది. ఎందుకంటే ఈ ఒక్క విషయంలోనే కాదు అమెరికా, ఇండియా మధ్య అనేక రకాల ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతుంది.

అయినా రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని అమెరికా చెప్పలేదు. 60 డాలర్లకు క్రూడాయిల్ బ్యారెల్ తీసుకోవాలని చెప్పింది.  అయితే రష్యా ఇండియాకు మరింత తక్కువ ధరకు అమ్మేందుకు ముందుకు వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్, డిజీల్ వాడకంలో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో 48 డాలర్లకు రష్యా ఇస్తానంటే ఎవరు వద్దంటారు. ఇండియా కూడా అదే చేస్తోంది. దీనిపై యూరప్ దేశాల కడుపు రగిలిపోతుంది. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్ కొనుగోలు చేస్తుంది ఇండియా అని జర్మనీ తన అక్కసు వెల్లగక్కుతోంది.

అంతే కాదు ఇప్పుడు రష్యా నుంచి తక్కువకు ఆయిల్ తీసుకొని ఇతర దేశాలకు ఎక్కువ ధరకు అమ్ముతోందని జర్మనీ ఆరోపణలు చేస్తుంది. దీని వల్ల రష్యా ఆర్థికంగా బలోపేతమవుతుందన్నది జర్మనీ భావన. కానీ ఇక్కడ భారత్ తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని గతంలో రష్యాతో ఉన్న అనుబంధానికి అనుగుణంగా ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ తన అవసరాలు తీర్చుకుంటూ ఇతరులకు ఇస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: