అమెరికాలో పెంపుడు కుక్కలకు గంజాయి దెబ్బ?

సాధారణంగా కుక్కలను పెంచుకునేవారు ఉదయం మరియు సాయంత్రం వాటిని కాలకృత్యాల కోసం షికారుకు తీసుకెళ్తూ ఉంటారు. అలా అవి వెళ్ళేటప్పుడు అవి దారిలో ఉన్న మొక్కలు, చెట్ల వాసనను తమ ముక్కుతో  పీల్చుకుంటూ వెళుతూ ఉంటాయి. అది సాధారణం. కానీ అమెరికాలో ఇలా బయటకు వెళ్లిన కుక్కలు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయట. అవి ఒక్కసారిగా ఉన్నచోటే తిరగడం, తూలిపోతూ ఉండటం, ఏదో భ్రాంతిలో ఉండటం లాంటివి చేస్తున్నాయట. అసలు ఏం జరుగుతుందా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

మనదేశంలో అయితే గంజాయి మొక్కలు నిషేధం కానీ, అమెరికాలో గంజాయి తరహాలో ఉండే మర్వాన అలియాస్ కెనబాస్ మొక్కలపై నిషేధాన్ని ఎత్తేశారు. మనమైతే వాటిని గంజాయి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. 2021 నుంచి డ్రగ్స్ కోసమని, అంటే టాబ్లెట్స్ లోకి ఇంగ్రెడియంట్ గా వాడడానికి వాటిని పెంచుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ మారవాన ఆకులను అవసరమని కోసేసాక వాటి తీగలను రోడ్డుమీద పడేస్తుండడంతో, ఆ తీగల వాసనను పీల్చడం లేదా ఆ తీగలను కొరకడం వల్ల అదే దారిలో వెళ్తున్న కుక్కలు ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయట.

ఆ విధంగా అవి మత్తులో, ఒక రకమైన బ్రాంతిలో పడిపోతున్నాయంట. ఇది మైండ్ ఆల్టరింగ్ కాంపౌండ్ ను కరిగించేస్తుందట. పెయిన్ మేనేజ్మెంట్ కోసం వాడే ఈ మొక్కల్ని కుక్కలు టచ్ చేయడంతో కుక్కలకు ఈ రకమైన సమస్య వస్తుందని తెలిసింది.

దీనివల్ల అమెరికాలో ఉన్న కుక్కల పెంపకం దారులకు గందరగోళ పరిస్థితి అయితే ఏర్పడిందట. తాము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తమ పెట్ డాగ్స్ కు ఇలా అవుతూ ఉండడం చూసి, అసలు వాటికి ఏమైందో అర్థం కాక మొదట్లో కంగారు పడ్డారట వారు. దీంతో ఈ వ్యవహారం అక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. దాంతో  దీనిపై తాజాగా అక్కడ బైడెన్ ప్రభుత్వం వీటిని రోడ్ల పైన పడవెయ్యద్దంటూ ప్రకటనలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: