కాశ్మీర్‌లో వాళ్లు.. మళ్లీ రెచ్చగొడుతున్నారా?

జమ్మూ కాశ్మీర్ లో గతంలో చూస్తే ఎప్పుడూ రాళ్ల దాడులు, పెట్రో బాంబు దాడులతో అట్టుడికి పోయేది. మరి ఆర్టికల్ 370, 35 రద్దు అయ్యాక అక్కడ పూర్తిగా ప్రశాంత వాతావరణం నెలకొంది. టూరిజం డెవలప్ మెంట్ అయింది. వ్యవసాయం పెరుగుతోంది. అక్కడ చాలా మార్పులు జరుగుతున్నాయి. దీంతో మత చాందసవాదులకు గ్రిప్ పోయింది. కాశ్మీర్లో ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వారు ఉన్నారు. పాకిస్థాన్ ముస్లింలు, బంగ్లాదేశ్ ముస్లింలు చాలా మంది అక్కడ సెటిల్ అయ్యారు.

రాష్ట్రాభివృద్ది కోసం రోడ్డు వెడల్పు పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇందులో చాలా వరకు రోడ్డుకిరువైపులా ఆక్రమణ చేసిన ఇళ్లు కోల్పోవాల్సి ఉంటుంది. కానీ మత ఛాందసవాదులు ఇదొక అవకాశంగా మలుచుకొని ప్రజల్లో ఉద్వేగాలు ఉద్రిక్తతలు రెచ్చగొట్టాలనుకుంటున్నారు. లాల్ చౌక్ లో ఇటీవల కిందట రాళ్ల దాడి జరిగింది. ఆగ్రహంతో, ఆవేశంతో ఉండే అక్కడి పౌరులను డెవలప్ మెంట్ కింద మనల్ని తొక్కెయాలని చూస్తున్నారని మనం మేల్కొకపోతే మన ప్రాంతంలో మనం పరాయి వాళ్లం అవుతామంటూ చాందసవాదులు అక్కడి ప్రజల్ని రెచ్చగొడుతున్నారు.

ఈ  విషయంలో ప్రధాని మోడీ మాత్రం ఎలాంటి బుజ్జగింపులు లేకుండా కాశ్మీర్ అభివృద్ధే తమ ఎజెండాగా ముందుకెెళుతున్నారు. అయితే దీన్ని అడ్డుపెట్టుకుని కాశ్మీర్ లో ప్రజలందరినీ ఒకే చోట గుమిగూడేలా చేసి వారిని రెచ్చగొట్టి మన ప్రాంతంలో మన ఇళ్లను ఆక్రమంగా తొలగిస్తున్నారని వారిలో ఆగ్రహావేశాలను కలిగిస్తున్నారు. ప్రభుత్వంపై లేని పోని నిందలను మోపి వారి పబ్బాన్ని గడుపుకుంటున్నారు.

ప్రస్తుతం ఇదే విషయంలో మళ్లీ కాశ్మీర్ లో అలజడులు రేపి ఆందోళనలు నిర్వహించి మళ్లీ పాత తరహాలో దాడులకు దిగేలా చేస్తున్నారు. దీనికి ఉదాహరణే రెండు రోజులు జరిగిన రాళ్లదాడి. ఇలాంటి దాడులు మళ్లీ జరగకుండా అణిచివేస్తేనే కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధి అందరికీ చేరుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: