రూ.900 కోట్ల మోసం.. లింగమనేని వివరణ ఇదీ!

రూ.900 కోట్ల మేరకు తనను లింగమనేని గ్రూపు మోసం చేసిందని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్‌ డా. బీఎస్‌ రావు చేసిన ఆరోపణలపై ఆ గ్రూపు స్పందించింది. తప్పుడు కథనాలతో మీడియా సమావేశం నిర్వహించి- అవాస్తవాలు తెలియజేశారంటూ లింగమనేని గ్రూపు ఒక ప్రకటనలో వివరణ  ఇచ్చింది. చైతన్య గ్రూపు ఛైర్మన్‌ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని.. అనైతికమని..  తమ మధ్య వ్యాపార, ఆర్ధిక వివాదాలు ఉన్నమాట వాస్తవమేనని... చైతన్య గ్రూపుతో 137 కోట్ల రూపాయల వివాదం మాత్రమే ఉందని తెలిపింది.

తాను మోసం చేవానని ఆరోపించడం అవాస్తవమని.. వివాదం న్యాయపరిధిలో ఉన్నందున దానిపై మాట్లాడడం సబబుకాదని లింగమనేని గ్రూపు తెలిపింది. ఈ వ్యవహారంలో ఇరువర్గాలు పోలీసు స్టేషన్లలోనూ, కోర్టుల్లోనూ కేసులున్నాయని..  63.70 కోట్ల రూపాయలకు సంబంధించి సెక్షన్‌ 143(ఎ) నెగోషియబుల్‌ ఇన్స్రుమెంట్స్‌ యాక్ట్‌ ప్రకారం కేసు విషయంలో సంబంధం లేకుండా 20 శాతం అంటే రూ.12.47 కోట్లను మూడు సమాన వాయిదాలలో డిపాజిట్‌ చేయాలని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. తుది తీర్పు వెలువడిన తర్వాత ఆ మొత్తంపై నిర్ణయం తీసుకుంటామని గ్రూపు తెలిపింది.

అంతే తప్ప 900 కోట్ల రూపాయలకు మోసం చేశామనడం అవాస్తవమని గ్రూపు తెలిపింది. NCLT, అమరావతి బెంచ్‌లలో శ్రీ చైతన్యగ్రూపు, లింగమనేని రమేష్‌ తదితరుల మీద దాఖలు చేసిన కేసులు పూర్తిగా విచారణ జరిపి ఎలాంటి చట్ట ఉల్లంఘన జరగలేదని కొట్టి వేశారని లింగమనేని గ్రూపు తెలిపింది. వ్యాపార లావాదేవీలను అడ్డుపెట్టుకుని పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే దురుద్దేశ్యంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని లింగమనేని గ్రూపు తెలిపింది.

అనేక అంశాలు కోర్టు పరిధిలో విచారణలో ఉన్నాయన్న లింగమనేని గ్రూపు.. వ్యాపార తగాదాల మొత్తం 130 కోట్ల రూపాయలు అని శ్రీ చైతన్యగ్రూపు వారి వాదన అని... ఏ న్యాయస్థానం ఇంతవరకు తాము తప్పుచేసినట్లుగా తీర్పు ఇవ్వలేదని లింగమనేని రమేష్‌ తన పేరిట విడుదలైన ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: