ఆ నేత ద్వారా.. జగన్ తెలంగాణలో వేలు పెడతారా?

జగన్ తెలంగాణలో బీజేపీకి అండగా ఉన్నారా.. లేక షర్మిలకు తెర వెనక నుంచి మద్దతు ఇస్తున్నారా? లేక బీఆర్ ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటారా అనేది  తేలిపోనుంది. 2014 సంవత్సరంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం నుంచి ఎంపీగా గెలిచారు. అప్పుడు ఖమ్మం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. ఆ సమయంలో సీపీఎం పార్టీ తో ఖమ్మం జిల్లా వరకు పొత్తు పెట్టుకున్నారు. అనంతరం గెలిచిన వారంతా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు.

పొంగులేటిని 2019 లో టీఆర్ఎస్ పక్కన పెట్టింది. దీంతో అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న పొంగులేటి ప్రస్తుతం యాక్టివ్ గా తన నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ లో చేరాదామంటే రేణుకా చౌదరి ఆదిపత్యం చెలాయించుకునేవారు. అందులో చేరే పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీలో చేరతారని ప్రచారం జరిగినా అది కాలేదు. వైఎస్ షర్మిల పెట్టినా పార్టీలో చేరతారని కూడా అందరూ అనుకున్నారు అది జరగలేదు.

అయితే ఈ మధ్య ఏపీ సీఎం జగన్ ను పొంగులేటి కలిశారు. వైరా, అశ్వారావుపేట, ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి, ఇల్లందులో తనకు బాగా పట్టు ఉందని ఆయనకు తెలిపారు. వైరా నుంచి బానోత్ విజయను, అశ్వరావుపేటలో జాడి ఆది నారాయణ రెడ్డిని పొంగులేటి ప్రకటించేశారు. నేను ఏ పార్టీలో ఉన్నా సరే వీరు ఆ రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అన్నారు.

ఇప్పుడు ఈ రెండు నియోజవర్గాల ఎమ్మెల్యే టికెట్లు ఎవరికి వస్తాయో జగన్ మద్దతు ఆ పార్టీకి ఇస్తున్నట్లు లెక్క. బీజేపీ తరఫున పోటీ చేస్తే జగన్ బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు, వైఎస్సాఆర్ టీపీ తరఫున పోటీ చేస్తే షర్మిలకు జగన్ అండ ఉన్నట్లు తేలిపోతుంది. అదే బీఆర్ఎస్ వీరికి టికెట్లు ఇస్తే జగన్ కు బీఆర్ఎస్ తో సంబంధాలు ఉన్నట్లు నిర్దారణ అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: