చావు బతుకుల్లో పుతిన్.. ఆ మీడియా సంచలనం?

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత పుతిన్ కు క్యాన్సర్ వచ్చిందని ప్రచారం జరిగింది. చర్మ వ్యాధులు వచ్చాయి. ఇప్పుడు చనిపోతాడు.. రేపు చనిపోతాడు అంటూ యూరప్ దేశాలు ప్రచారం నిర్వహించాయి. కానీ అలాంటిదేమీ లేదని రష్యా తేల్చి చెప్పింది. అయితే రష్యా మాత్రం యుద్ధంలో ఎక్కడ తగ్గడం లేదు. ఇలాంటి ప్రచారం వల్ల రష్యాన్ సైనికుల నైతిక స్తైర్యాన్ని దెబ్బతీయాలని ఉక్రెయిన్ వ్యవహరిస్తోంది.

రష్యా గతంలో క్రిమియాను ఆక్రమించుకున్నప్పుడు రష్యా సైనికాధికారిగా ఉన్న గిర్కిన్ ను ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో పుతిన్ పక్కన పెట్టారు. దీంతో ఆయన అమెరికా వెళ్లిపోయారు. ఆయన కూడా పుతిన్ ఆరోగ్యం బాగాలేదని చెప్పినట్లు ఉక్రెయిన్ కు సంబంధించిన మంత్రులు చెబుతున్నారు. అలాగే వెస్ట్రన్ మీడియా అయినటువంటి న్యూస్ వీక్ ఈ విషయాన్నే పదే పదే చెబుతోంది. రష్యా అధ్యక్షుడి ఆరోగ్యం ఏమీ బాగోలేదు. అతనికి క్యాన్సర్ వల్ల దీర్ఘకాలంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రేపో మాపో చనిపోతాడని మీడియాలో ఉక్రెయిన్ కు సంబంధించిన వారు ప్రచారం చేస్తున్నారు.

అయితే దాదాపు యుద్ధం చేయబట్టి ఏడాది కావొస్తుంది. దీంతో ప్రత్యేకంగా మరిన్ని యుద్ధ ట్యాంకులతో 5 లక్షల సైన్యం తో ఉక్రెయిన్ లోని తమ భూభాగాలుగా భావిస్తున్న అన్నింటిని స్వాధీనం చేసుకోవాలని రష్యా అనుకుంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడికి ఆరోగ్యం సహకరించడం లేదని ప్రచారం చేయడం వల్ల రష్యా సైనికుల నైతిక స్థైర్యం దెబ్బతినాలని వెస్ట్రర్న్ మీడియా వ్యవహరిస్తోంది. ఏం చేసినా రష్యా కూడా వెనక్కి తగ్గేలా లేదు.

యుద్ధంలో రష్యా గెలవకున్నా ఉక్రెయిన్ మాత్రం ఇప్పటికే చాలా నష్టపోయింది. అమెరికా, యూరప్ దేశాలు ఎంత సాయం చేసినా కోలుకునేలా కనిపించడం లేదు. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రష్యా వద్ద ఉన్న ఆయుధాలు అయిపోతాయని అగ్రరాజ్యం, ఉక్రెయిన్ భావిస్తోంది. తర్వాత ఎలాగో యుద్ధం ఆగిపోతుంది. రష్యా ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింటుందని ఉక్రెయిన్ అనుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: