బాలయ్యా.. ఈ నోటి దూల ఏంటయ్యా?

బాలకృష్ణకు వివాదాలు కొత్తవి ఏం కావు. తన ఆసుపత్రిలో ఒక యాక్సిడెంట్ కేసులో వచ్చిన పేషేంట్ కు సేవలందిస్తున్న నర్సును చూసి మహా అందంగా ఉంది బాసు అని అన్నారు. దీనిపై నర్సుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. దీంతో ఆయన నేను అన్న మాటను వక్రీకరించారని వివరణ రాసుకొచ్చారు.

బాలయ్య క్షమాపణ విచిత్రంగా ఉంటుంది. నర్సులను కించపరచానంటు కొందరు నా మాటల్ని వక్రీకరించారు. వారు నా  సోదరిమణులతో సమానం. రోగులకు సేవలందించే వారంటే నాకు మరెంతో గౌరవం. బసవతారకం ఆసుపత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను. రాత్రి పగలు రోగులకు సపర్యలు చేసి ప్రాణాలు నిలబట్టే నా సోదరిమణులు అంటే నాకెంతో గౌరవం. వాళ్లకు ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే. కరోనా సమయంలో ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు ఎంతో సేవ చేశారు. అటువంటి నర్సులను మనం మెచ్చుకుని తీరాలి. నిజంగా నా మాటలు వారిని ఏమైనా బాధపడితే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను అని బాలకృష్ణ ఒక వివరణ ఇచ్చారు.

కానీ ఆ వివరణలో తను అన్న పదానికి సంబంధించి ఎలాంటి వివరణ లేదు. కేవలం దాన్ని కొందరు వక్రీకరించారు వారంటే నాకెంతో గౌరవం అంటూ రాసుకొచ్చారు. అయితే బాలయ్య మాట్లాడేటప్పుడు చాలా సార్లు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. మొన్న ఏకంగా అక్కినేని తొక్కినేని అని తన తండ్రి తో సమానంగా పోటీ పడి నటించిన తెలుగు నట దిగ్గజం ఏఎన్నార్ ను అవమానించారు.

గతంలోనూ అమ్మాయిలను చూస్తే ఏదో చేసేయాలని అనిపిస్తోందని స్టేజీపైనే వాగారు. మైక్ లు, ఫోన్ లు విసిరేయడాలు కోపంగా తిట్టడాలు, నోటికి ఏదోస్తే అది మాట్లాడటం బాలయ్య కు పరిపాటిగా మారింది. తర్వాత దానిపై ఇలా పశ్చాత్తాపపడుతున్నాను అంటూ వివరణ ఇచ్చుకోవడం అలవాటయింది. బాలయ్య వ్యాఖ్యలపై జనాలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: