తెలంగాణలో రాష్ట్రపతి పాలన తప్పదా?

రాజకీయాల్లో పాదయాత్రలు పవర్ లోకి తీసుకొచ్చే మహా ఆయుధాలు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో అధికారం చేబట్టడానికి ఎంతో ఉపయుక్తమైంది. అలాంటి పాదయాత్ర చేపట్టడానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందడుగు వేశారు. దీన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు చేయాల్సిన పనులన్నింటినీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జిని మార్పించారు. కానీ కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి రెచ్చిపోయారు. పాదయాత్ర అందరం చేద్దామన్నారు. తర్వాత ఒక్కరే చేస్తున్నారని విమర్శించారు.

వైఎస్ పాదయాత్ర సమయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన పాదయాత్రను కూడా అడ్డుకునేందుకు ఎంతో మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఆదర్శంగా తీసుకోవాలి. ఈ సమయంలో టీపీసీసీ మాజీ చీప్ reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈ నెల చివరి నాటికి ప్రభుత్వం రద్దయిపోయి రాష్ట్రపతి పాలన వస్తుందన్నారు. రాష్ట్రపతి పాలన పెట్టాలని ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని  కోరతామన్నారు.

దేశంలో రాహుల్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. బీజేపీ మతపరమైన బేధాలతో దేశంలో విధ్వంసం సృష్టిస్తున్నాయన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో జరిగిన ఒక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.  ముందస్తుకు వెళ్లాలంటే తెలంగాణ ప్రభుత్వం తమకు తాము ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు పోవాలి. కానీ వారెందుకు వెళతారు. మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టారు. దళితబంధు, రైతు బంధు ఇతర పథకాలను విజయవంతంగా కొనసాగిస్తామని చెబుతున్నారు.

అన్ని పథకాలను ఆపేసుకొని శాసనసభను రద్దు చేసుకుని బీఆర్ఎస్ ఎన్నికలకు ఎలా వెళుతుంది. ఒకవేళ ప్రభుత్వం రద్దయితే రాష్ట్రపతి పాలన వస్తుంది. ఎన్నికలు జరుగుతాయి. అయినా బీఆర్ఎస్ కు ఇప్పుడు ఎన్నికలు అవసరం లేదు. మరి reddy NALAMADA' target='_blank' title='ఉత్తమ్ కుమార్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊహించి చెప్పారా? లేక నిజంగానే ఈ విషయం ఆయన చెవిన పడిందా నెలరోజులు గడిస్తే కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: