మీడియాను కూడా మోదీ వాడేసుకుంటున్నాడా?

గతంలో వాజపేయి ప్రభుత్వం  ఉన్నప్పుడు మీడియాకు వెసులుబాటు ఉండేది. ఆ ప్రభుత్వాలు మీడియా సంస్థలకు జాతీయస్థాయిలో తోడ్పడుతూ ఉండేవి.  మీడియా సంస్థల్ని టూర్స్ కి తీసుకు వెళ్ళడం, వాళ్లకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ సమకూర్చేవారు. 2014 తర్వాత మీడియాకి ప్రతికూల  పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మీడియాకు వెసులుబాటు ఉండేది.

2014లో తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కేవలం నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఇలా తెలంగాణ వార్తలకే విలువనిస్తూ మిగిలిన మీడియా వారిని పట్టించుకోవడం మానేశారన్న విమర్శలు ఉన్నాయి.  సచివాలయంలో దర్జాగా తిరగాల్సిన జర్నలిస్టుల్ని లోపలికి రానివ్వకుండా ఒక్కచోటికి పరిమితం అయ్యేలా చేశారు. ఇక ముఖ్యమంత్రి పేషీలు, ముఖ్యమంత్రి కార్యాలయాలైతే వారికి అందని ద్రాక్షలే అయ్యాయి. మీడియా వారి విషయంలో, ఒక రకంగా చూసుకుంటే కేసీఆర్ కన్నా చంద్రబాబు నాయుడు బెటర్ అని చెప్పుకోవచ్చు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే మీడియా యాజమాన్యాలకి అనుమతినిచ్చేవారు. అందుకే తెలంగాణ మీడియా కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతునిస్తూ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ జర్నలిస్టులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సాక్షి పత్రిక, సాక్షి న్యూస్ చానల్స్ తప్ప మిగిలిన వాటిని ఆయన పట్టించుకోవడం మానేశారు. అలాగే కేంద్రంలో మోడీ వచ్చినప్పటి నుంచి ఈ నేషనల్ మీడియాను పట్టించుకోవడం లేదు.

దీంతో నేషనల్ మీడియా, లోకల్ మీడియాలను పట్టించుకోవడం మానేసేసరికి వీరు కూడా వ్యతిరేక వార్తల్ని తప్ప అనుకూల వార్తలని రాయడం లేదు. దీనిపై ఇప్పుడు మోడీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. మీడియాలో ప్రతిరోజు 30 నిమిషాల పాటు తప్పనిసరిగా దేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసారం చేయాలని అందరికీ సర్క్యులర్లు పంపింది. విద్య, వైద్యం, సైన్స్ పేద వర్గాలకు అందిస్తున్న స్కీములు గురించి ప్రతిరోజు ప్రసారం చేయాలని చెప్పి కేంద్రం అన్ని చానల్స్ ని కోరింది. మరి మీడియా వారు ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: