దేశం సంగతి తర్వాత.. కేసీఆర్‌కు షాక్‌ ఇస్తున్న సర్వే?

ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంటూ ఆరు నెలలకు ఒకసారి ఓ సర్వే నిర్వహిస్తుంటుంది. ఇందులో ఏ రాజకీయ పార్టీకి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందా లేదా ఎంత శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది. వారి పాలన ఎలా ఉంది అని అభిప్రాయాలతో సర్వే నిర్వహిస్తుంది. గత ఆగస్టులో నిర్వహించినటువంటి సర్వేలో  భారతీయ జనతా పార్టీకి 6 ఎంపీ స్థానాలు తెలంగాణలో వస్తాయని చెప్పింది.

మళ్ళీ తాజాగా చెప్పిన దాంట్లో కూడా అలాగే ఆరు ఎంపీ స్థానాలు వస్తాయని తెలిసింది. అయితే మిగతా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని వెల్లడించింది. అంటే 9 లేదా పది ఎంపీ స్థానాలు బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉంటుంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు కాస్త కంగారు పడే అవకాశం ఉంది. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన తర్వాత దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ బావిస్తుంటే ఒకపక్క తెలంగాణలోనే సీట్లు తగ్గిపోతున్నాయని సర్వేలు తెలపడం కాస్త ఆందోళన కలిగించే విషయం.

ఇది బిజెపి వాళ్ళు చేస్తున్న ట్రిక్ అని భావిస్తున్నారు.  స్టాప్ హోల్ అనే ఒక కొత్త సర్వే ద్వారా కొన్ని వివరాలను తెలుస్తున్నాయి. బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందని ఒక సర్వేను నిర్వహించారు. దీనిని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రముఖ న్యాయవాది విశ్వ జంపాల చేపట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన బాగుందని 27.2 శాతం మంది బాగోలేదని 70 శాతం మంది వరకు తెలిపారని ఆయన సర్వేలో చెప్పారు.

కానీ సర్వే అంటే ఎక్కువ మందితో వివరాలు సేకరించడం ఇక్కడ 180 మంది అభిప్రాయాలు తీసుకుని దాన్ని పూర్తిగా ప్రభుత్వ పాలనకు అంటగట్టడం అనేది అసలు ఏ మాత్రం సబబు కానీ అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: