కాంగ్రెస్‌లో మోదీ డాక్యుమెంటరీ భూకంపం?

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏకే ఆంటోని కొడుకు కేరళ కాంగ్రెస్ సోషల్ మీడియా కు పని చేస్తున్న అనిల్ ఆంటోనీ కి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద పదవి అప్పచెప్పింది. అది ఏమిటంటే 2014 లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎందుకు ఓడిపోయింది. దానికి గల కారణాలు, విశ్లేషణ పూర్తి సమాచారం ఇవ్వాలనే పని అప్పచెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు విషయం ఏమిటంటే ఆ పదవికి రాజీనామా చేశారు. కారణం ప్రధానికి అనుకూలంగా మాట్లాడటం.

కోర్టు ల్లో కేసులు కేసులు కొట్టేసినటువంటి గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఒక డాక్యూమెంటరీ చేసింది. ఆ డాక్యుమెంటరీ పై వివాదం చెలరేగింది. దీనికి అనుకూలంగా అనిల్ అంటోని మాట్లాడుతూ కోర్టుల్లో కేసులు కూడా అయ్యాయి. దాన్ని కొట్టి వేశారు. అంతా అయిపోయినా దాని గురించి ఇప్పుడు బీబీసీ ఎందుకు ప్రచారం చేస్తుంది అని ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం భగ్గుమంది. కాంగ్రెస్ కు సంబంధించిన సీనియర్ నాయకుడు కొడుకు అయి ఉండి బిజెపి పార్టీకి ప్రధానమంత్రి మోడీకి ఎలా మద్దతు ప్రకటిస్తారని దీనికి సంబంధించి అనిల్ అంటోని తన రాజీనామా చేశారు.

అయితే దీనిపై విస్తృతంగా చర్చ నడుస్తుంది. ఏకే ఆంటోని ఎలాంటి అవినీతి చేయని మచ్చలేని నాయకుడు అతని కొడుకు కూడా అలానే ఉండాలని కోరుకునే విధంగా ఉన్నాడు. కానీ దిగ్విజయ్ సింగ్, ఇతర కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఆర్థిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ ఏకే ఆంటోని, ప్రణబ్ ముఖర్జీ లాంటి సీనియర్ నాయకులు ఏనాడు ఒక్కసారి కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న పాపాన పోలేదు. గతంలో చిరంజీవి పార్టీని వీలీనం చేయడానికి కారణం కూడా ఏకే ఆంటోని. అనిల్ అంటోని చివరకు తేల్చింది ఏమిటంటే మైనార్టీలను బుజ్జగిస్తున్నట్లు మాత్రమే వారిలో భావన ఉంది. కానీ మైనార్టీలకు కాంగ్రెస్ ఏం చేయడం లేదన్నది అతను చేసిన విశ్లేషణలో బయటపడిన అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: