పాకిస్తాన్‌లో మోదీ పర్యటించాలనుకున్నారా?

పాకిస్థాన్ ఆర్మీ అధికారి జనరల్ బాజ్వా పాకిస్థాన్ అధికారా లేక చైనా అధికారి అని అనాలో తెలియడం లేదు. డ్రాగన్ కనుసన్నల్లో పనిచేస్తూ వారి చెప్పు చేతల్లో ఉండటమే ఇతని పని. తర్వాత అమెరికా బాజ్వాను దూరం పెట్టింది. బాజ్వా గద్దె దిగిపోయాడు. ఆ స్థానంలో కొత్త వాడు వచ్చాడు. అనంతరం దేశ విదేశాలు తిరుగుతున్నాడు .ఈ సమయంలో బాజ్వా ఒక జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చాడు.  

ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో భారత ప్రధాని మోదీ పాకిస్థాన్ లో తొమ్మిది రోజులు పర్యటించాలనుకున్నాడు. సమావేశాల్లో మాట్లాడాలనుకున్న సారాంశం ఏమిటంటే పాకిస్థాన్ కాశ్మీర్ గురించి ఒక 20 ఏళ్ల వరకు మరిచిపోవాలి. ఆ అంశాన్ని ఎక్కడ లేవనెత్తకూడదు. దాని వల్ల మోదీ చరిష్మా పెరుగుతుంది. దాన్ని ఒక సాధారణ అంశంగా చూడాలి. ఇలాంటి షరతులతో సమావేశం జరగాల్సి ఉంది. తద్వారా కాశ్మీర్ లో అభివృద్ధి జరుగుతుంది. కానీ దీనికి నేను అడ్డుపడ్డానని భాజ్వా ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

దీనికి సంబంధించి భారత్ పూర్తిగా ఖండించింది. భారత్ కూడా తోసిపుచ్చింది. అసలు విషయం ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి మళ్లీ ప్రధాని కావాలంటే కష్టంగా ఉంది.  సైన్యం మొత్తం ప్రస్తుత పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేతుల్లో ఉంది. రేపో మాపో ఇమ్రాన్ ను చంపేసిన ఆశ్యర్య పోవాల్సిన అవసరం లేదన్న వాదన వినిపిస్తోంది. కాబట్టి ఇదంతా ఇమ్రాన్, బాజ్వా ఆడుతున్న నాటకమని పాకిస్థాన్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది.

ఈ విషయంపై పాక్ ప్రభుత్వం బాజ్వాను, విచారించాలనుకుంటున్న సమయంలో భారత ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. అదంతా ఓట్టి మాటలేనని అలాంటి సమావేశం జరగాలనుకున్న అంశం ఏమీ లేదని తేల్చింది. అయినా పాక్ సైనికాధికారులకు అబద్దాలు ఆడటం కొత్తనా ఏమిటి? అలవాటయిన పని అయినప్పటికీ సరికొత్త అంశం మీద ఓ మాజీ సైనికాధికారి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర చర్చనీయాంశం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: