ఇక ఇండియాలో ఆ కొత్త వాహనాలదే హవా?

ఎలక్ట్రానిక్ వాహనాల విషయంలో భారత్.. జపాన్‌ పక్కకు నెట్టి థర్డ్ లార్జెస్ట్ ఆటో మేకర్‌గా నిలిచింది. ఆ మార్కెట్ రంగంలో భారతదేశం అతివేగంగా పరుగులు తీస్తుంది. ప్రత్యేకించి ఈ మార్కెట్ పెర్ఫార్మెన్స్ లింకెడ్ ఇన్సెంటివ్ (పి ఎల్ ఐ) తర్వాత వేగాన్ని అందుకుంటుంది. భారత దేశపు మార్కెట్ అతి పెద్దది కాబట్టి అది ఏటా పెరుగుతుందని ఫ్రెంచ్ కి సంబంధించిన వినోమ్ భారత దేశపు మేడిన్ ఇండియా పై కాన్సన్ట్రేషన్ చేసింది.

2022లో 4.4 మిలియన్స్ ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే, 2021-22 లో కేవలం 42,178 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత చూస్తే 2022లో అంటే గత ఏడాది 4.4 మిలియన్స్ ఎలక్ట్రిక్ వాహనాలను భారత్ వినియోగంలో పెట్టింది. భారత్‌లో మొత్తం నడుస్తున్న వాహనాల్లో నాలుగు శాతం మాత్రమే నడుస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల శాతాన్ని 30% గా మార్చాలన్నది మోడీ ప్రభుత్వపు  ఆలోచన. అందుకే సబ్సిడీలు కూడా బాగా ఇస్తున్నారు.

అమెరికా, చైనా తర్వాత  భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ నడుస్తున్నాయి. ఇక్కడ పి ఎల్ ఐ కూడా 18%అధికంగా  లభించడంతో అనేక కంపెనీలు భారత్ పై దృష్టి సారిస్తున్నాయి. ఈ ఏడాది 74,850  కోట్లు రూపాయల నిధులు  దీని కోసమే వచ్చాయి.  రెనాల్ట్ ఇంకా స్కోడా కార్ల కంపెనీలు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి దిగుతున్నాయి. జీడీపీలో,  పెట్టుబడులలో  6.5% ఆటోమొబైల్ రంగందే ఉంది. అందుకే అంతర్జాతీయ సంస్థలు భారత దేశానికి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఒక్క టెస్లా మాత్రమే, దానికి సబ్సిడీలు ఇస్తేనే  వస్తానని అంటుంది.

కానీ భారతదేశం మాత్రం ఇక్కడ తయారు చేసుకునే విధంగా ఉంటేనే సబ్సిడీలు ఇస్తామని చెప్తుంటే, టెస్లా మాత్రం తాను చైనాలోనే తయారు చేసి  భారతదేశంలో  అమ్ముతానని చెప్తుంది. కానీ ఇక్కడ ప్రతి 10-20 కిలోమీటర్లకి ఒక ఛార్జింగ్ స్టేషన్  ఉన్న సందర్భంలో మాత్రమే  భారత దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పరుగు ఊపందుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: