వైఎస్‌ తర్వాత మళ్లీ ఆ పని చేసింది జగనే?

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైయ‌స్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రాష్ట్రంలో పలు పోర్టులు నిర్మించారు. ఆ నేత‌ వైఎస్సార్‌ మరణాంతరం వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా పోర్టులు నిర్మాణం చేపట్ట లేదు. ఆ తర్వాత తండ్రి ఆశయ సాధన కోసం తో పని చేస్తున్న మన ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ రామయ్యపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ పోర్టుల పూర్తి స్థాయి పనుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

భావనపాడు పోర్టు కోసం నా చిన్నతనం నుంచి ఎంతో మంది చెప్పిన మాయమాటలు విన్నానని కానీ ఒకే ఒక్క నాయకుడు ఆ దిశగా ప్రయత్నం చేసి పోర్టు నిర్మాణం కోసం నిధులు వెచ్చించారని మంత్రి సీదిరి అప్పలరాజు అంటున్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ, వారి కష్టాల పట్ల  అవగాహన ఉంది కాబట్టే ఈ పనులు చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.  పేద ప్రజల కోసం మంచి చేయాలని ఒక సంకల్పంతో జగన్  పని చేస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు.

ఒక మత్స్యకారుడునైన తనకు అలాంటి ఒక గొప్ప వ్యక్తితో పనిచేసే అవకాశం దొరికినందుకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. జగన్ లక్ష్య సాధన కోసం మరింత కష్టపడి పేద ప్రజల సంక్షేమం కోసం పని‌చేస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గత ప్రభుత్వాలు మత్స్యకారులను నిర్లక్ష్యం చేశారని సీదిరి అప్పలరాజు ఆవేదన చెందారు. రాష్ట్రంలో తొమ్మిది వందల కిలోమీటర్లకు పైబడి తీరప్రాంతంయ... శ్రీకాకుళం జిల్లాలో 194 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉన్నదన్న సీదిరి అప్పలరాజు... తీర ప్రాంతంలో ఎన్నో వేల మత్స్యకార కుటుంబాలు ఉన్నాయన్నారు.

రాష్ట్రంలో గతంలో రెండు హార్బర్ లు మాత్రమే ఉండేవని.. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి..  పాదయాత్రలో తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారుల బాధ‌లు విన్నారని అప్పలరాజు గుర్తు చేశారు. జగన్..  దాదాపు తొమ్మిది హార్బర్ లు నిర్మాణం చేపడుతూ ఆ హామీలు నిలబెట్టకున్నారని మంత్రి అప్పలరాజు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: