అన్నీ చెప్పిన కేసీఆర్‌.. ఆ విషయం చెప్పలేదే?

భారత రాష్ట్రసమితిలో  రావెల కిషోర్ బాబు, తోట చంద్రశేఖర్, రమేష్ నాయుడు, టీజే ప్రకాష్, శ్రీనివాస్ నాయుడు వీళ్ళందరి సమక్షంలో  కేసీఆర్ ఎన్నో మాట్లాడారు.. ప్రపంచాన్ని అలా అభివృద్ధి చేద్దాం దేశాన్ని ఇలా అభివృద్ధి చేద్దాం  విశాఖ స్టీల్ ప్లాంటుని అమ్మనివ్వవద్దు అని  కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ప్రపంచం విషయం పక్కన పెడితే  అసలు ఈయన  ఆంధ్రకు ఏమి  చేశారన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సెక్షన్ 9 సెక్షన్ 10  సంస్థల ఆస్తులు ఈరోజు వరకు తెలంగాణ ఇవ్వట్లేదు..  అలాగే  ఈరోజు వరకు కూడా  కృష్ణ గోదావరి జలాల విషయంలో తెలంగాణ వివాదం చేస్తూ ఆంధ్రకి అందనివ్వకుండా చేస్తోంది... అసలు ఆయన  వల్లే..ఆంధ్రాకి అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తోంది.

సుదీర్ఘకాలం కలిసి ఉన్నామని మొత్తం తీసుకొచ్చి హైదరాబాదులో పెట్టాక  తెలంగాణ లో గొప్పగా చెప్పుకునేది హైదరాబాద్ గురించే.  ఇవాల్టికి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్,  జిల్లాల వారు  ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వలసలు పోతున్నారు.  మరి అప్పుడు తెలంగాణ విషయంలో ఏం సాధించామని ఆంధ్ర టాపిక్ తీసుకురావడానికి..  ఒక హైదరాబాద్ తప్పితే అదికూడా ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ స్థాపించిన వ్యాపారాలు, పరిశ్రమలు ఇంకా రియల్ ఎస్టేట్ తో మొదలైన హైదరాబాద్ అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తున్నా.. అది కొనసాగింపే గాని కొత్తగా  చేసినా అభివృద్ధేమీ కాదన్న వాదన వినిపిస్తోంది.

మరి తెలంగాణలో కేసీఆర్ ఏం చేస్తున్నట్టు.. వరంగల్‌ను, నిజామాబాద్‌ను, ఆదిలాబాద్‌ను కరీంనగర్‌ను దేన్నీ హైదరాబాదులా అభివృద్ధి చేయలేదన్న వాదన వినిపిస్తోంది. మరో మహా నగరాన్ని ఇక్కడ  కొత్తగా ఏమి సృష్టించలేదు. అప్పుడు ఏం అద్భుతం సాధించేమని చెప్పుకుంటారు. ఆంధ్ర పాలకులందరూ ఆంధ్ర ప్రజలను మోసం చేసి జనాలందరూ కూడా అక్కడికి  వస్తేనే వాళ్ళ ఆస్తులు కూడా డెవలప్ అవుతాయని  స్వార్థంతో వాళ్లను తీసుకురావడం వల్లే ఈరోజు మనం చూస్తున్న హైదరాబాద్ ఉందన్న వాదన వినిపిస్తోంది.. తెలంగాణను  అభివృద్ధి చేసిన ఆంధ్ర వాళ్లకు ఏం చేస్తామో చెప్పకుండా దేశాన్ని ఏదో మార్చేస్తామని చెప్తే ఎలాగా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: