ధరణి లోపాలతో తెలంగాణలో హత్యలు, నేరాలా?

ధరణి.. తెలంగాణలోని భూ రికార్డులన్నీ ఆన్‌ లైన్‌లో నిర్వహించాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థ అంతా లోపభూయిష్టంగా ఉందన్న విమర్శలు ప్రజల నుంచే కాదు.. పార్టీల నుంచి ఉన్నాయి. ప్రధానంగా విపక్షం కాంగ్రెస్ ఈ అంశంపై ఉద్యమాలే చేస్తోంది. ధరణిలో లోపాల వల్లనే తెలంగాణ రాష్ట్రంలో అల్లకల్లోలం ఏర్పడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.  ప్రశాంతంగా ఉన్న తెలంగాణాలో మూడు హత్యలు ఆరు ఆత్మ హత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు.

ధరణి లోపాల కారణంగా తెలంగాణలో భూ తగాదాలతో హత్యలు , ఆత్మహత్యలు జరుగుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేసారు. కాళేశ్వరం దండగ ప్రాజెక్టు అని అది ప్రయోజనం లేని ప్రాజెక్టు అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అభివర్ణించారు. ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే రూ 40 వేలు విద్యుత్ బిల్లు అవుతుందని అధికారులు చెబుతున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.

అలాంటి ప్రాజెక్టును ఎందుకు కట్టారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ధరణి ఇతర అంశాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నాయకుడు భట్టిలతో కలిసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కొందరు ప్రభుత్వ అధికారులు కెసిఆర్ కి తొత్తులుగా పని చేస్తూన్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో, లిక్కర్ కుంభ కోణంలో కూడా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: