మోదీని తిడుతూ.. కేసీఆర్‌ కూడా అదే పని చేస్తున్నారా?

కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.. ఆఫీసులో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేయడం కలకలం రేపింది. సునీల్ ఆఫీసులోకి వెళ్లి సోదాలు చేసి.. హార్డ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. వీటిపై అధికారిక వివరాలు.. వెంటనే తెలపలేదు. సోదాల జరిపిన తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు సైబర్ క్రైం పోలీసులు. ఇతర పార్టీల నేతలను టార్గెట్ గా చేసి మార్ఫింగ్ చేస్తున్నారని ఆ ప్రెస్ మీట్ సారాంశం.

అసలు అది కాంగ్రెస్ వార్ రూం అని తెలియదని.. ఐపీ అడ్రెస్ ఆధారంగానే సోదాలు చేశామని ట్విస్ట్ ఇచ్చారు. మహిళల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. మార్ఫింగ్ చేస్తున్నట్లు వచ్చిన సమాచారంతోనే దాడులు చేశామన్నారు. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్లు నేతలెవరినీ అరెస్టు చేయలేదని..  కేవలం సెక్షన్ 41 కింద నోటీసులు ఇచ్చామన్నారు సైబర్ క్రైం పోలీసులు.

ప్రెస్ మీట్ లో మాత్రం ఇతర పార్టీల మహిళా నాయకులు అంటున్నారు కానీ.. అసలు విషయం మాత్రం వేరు. లిక్కర్ స్కాంలో కవితను సీబీఐ విచారించింది.. దీంతో కవితను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రారంభోత్సవం.. మరోవైపు సీబీఐ విచారణ, లిక్కర్ స్కాం ఆరోపణలతో అధిష్ఠానం తలమునకలైంది. ఈ టైంలో కేసీఆర్ సర్కారు సోషల్ మీడియా కంటెంట్ ను సీరియస్ గా తీసుకుంది.

ఈ విషయంలో సైబర్ క్రైం పోలీసులను ఆయుధంగా వాడుకుంది. మరి ఇక్కడ అందరూ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే.. టీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీ, ఆ పార్టీ నేతల విషయంలోనూ అలానే చేస్తున్నారు కదా. బీజేపీపైన, ఆపార్టీ నేతలపైన దుష్ప్రచారాలు చేస్తున్నారు.. అయితే ఈ చట్టాలు మాత్రం అధికారంలో ఉన్న వాళ్లకే ఉంటాయా అనే మిలియన్ డాలర్ల ప్రశ్న. మరి ఈ విషయాన్ని పోలీసులు ఎలా సమర్ధించుకుంటారో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: