గుడ్‌న్యూస్‌: ఆ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు..?

ఇది ఎలక్ట్రిక్‌ యుగం... ఆటోమొబైల్ రంగంలో విద్యుత్ వాహనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. పర్యావరణానికి హాని లేకుండా ముందుకు నడిపించే ఈ విద్యుత్ వాహనాలదే ఇప్పుడు భవిష్యత్.. కొన్ని ఇబ్బందులు ప్రస్తుతానికి ఉన్నా.. ముందు ముందు ఈ రంగం భవిష్యత్‌ ఉజ్జ్వలంగా ఉండే అవకాశం ఉంది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి కూడా ఇదే అంటున్నారు.

దేశంలో పెట్రోల్, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సహజ వనరుల ద్వారా ఇంధనం తయారీ చేసే విధానాలు అభివృద్ధి చెందాలంటున్న కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి.. విద్యుత్ వాహన రంగంలో నాలుగు కోట్ల ఉద్యోగాలు రాబోతున్నాయన్నారు. ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఎంతో ప్రగతి ఉందని.. దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా పెరగడంలో ఈ రంగం కీలకం కానుందని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి అంటున్నారు.

దేశంలోని యువ ఇంజనీర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి పిలుపునిచ్చారు. యువకులు కేవలం ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి ఆకాంక్షించారు. చదువు, విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, దేశం పట్ల బాధ్యత చాలా ముఖ్యమని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం అగ్రగామిగా ఎదగాలంటే వ్యవసాయరంగంలో వృద్ధిరేటు పెరగాలని గడ్కరీ అన్నారు.

రహదారులు, ఫ్లై ఓవర్లు నిర్మాణం విషయంలో తనకు బాగా పేరొచ్చిందన్న గడ్కరీ... కానీ.. తనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టమని అన్నారు. జలవనరులు, ఓడరేవుల మంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి, పోలవరం నిర్మాణానికి, బంకింగ్ హాం కెనాల్ జల రవాణాకు కృషి చేశానని గడ్కరీ అంటున్నారు. పెట్రో ఉత్పత్తుల కోసం మన దేశం వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేస్తోందని.. దీన్ని తగ్గించాలని గడ్కరీ పిలుపు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: