షర్మిలకు మంత్రి నిరంజన్‌రెడ్డి షాకింగ్‌ సవాల్‌?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలకూ మంత్రి నిరంజన్ రెడ్డికీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గతంలో నిరంజన్ రెడ్డి వైఎస్‌ షర్మిలను మంగళవారం మరదలు అని ఓసారి కామెంట్ చేశారు. దానిపై ఆమె ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యల కోసం తాను పోరాడుతుంటే.. తనపై మంగళవారం మరదలు అని వ్యాఖ్యలు చేయడం ఏంటని పాదయాత్రలో షర్మిల మండిపడ్డారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రి నిరంజన్ రెడ్డీకీ.. వీధిలో తిరిగే వీధి కుక్కకూ తేడా ఏముందని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలు తీరుస్తామని.. రాజన్న రాజ్యం తీసుకొస్తానని వైఎస్ షర్మిల అన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డిపై వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా మంత్రి నిరంజన్ రెడ్డి కూడా స్పందించారు. తెలంగాణలో విజయం సాధిస్తామనే ధైర్యం ఉంటే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేయాలని వైఎస్‌ షర్మిలకు మంత్రి నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు.

మునుగోడు ఉప ఎన్నికల్లో వైఎస్‌ షర్మిల పోటీ చేసి.. దమ్ముంటే ధరావతు దక్కించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఛాలెంజ్ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా వనపర్తిలో వైఎస్‌ షర్మిల మంత్రిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలపై ఆయన  గోపాలపేట స్పందించారు. ఆసరా కొత్త పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిరంజన్ రెడ్డి పై విధంగా వ్యాఖ్యానించారు.

గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వద్దన్నవారు, తెలంగాణ ఏర్పాటుకు అడ్డుపడినవారు ఇప్పుడు పాదయాత్ర పేరుతో తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడితే సహించేది లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయ్యారని.. వ్యవసాయంతో పాటుగా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌ 1గా మార్చారని అన్నారు. ఇది సహించలేకే..  కన్నుకుట్టిన కొందరు నేతలు విమర్శలు చేస్తున్నారన మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: