బాబు దిల్లీ వెళ్తే.. వైసీపీ ఉలికిపడుతోందా?

చంద్రబాబు దిల్లీ పర్యటన ఏపీలో రాజకీయ విమర్శలకు తెరలేపింది. ఈసారి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఐదు నిమిషాలు.. మాట్లాడటం టీడీపీకి సంతోషాన్నిచ్చింది. చంద్రబాబు అనుకూల మీడియా కూడా దీన్ని బాగా హైలెట్ చేసింది. అయితే.. ఈ బిల్డప్‌ ఏంటంటూ వైసీపీ నేతలు వరుసగా చంద్రబాబు దిల్లీ టూర్ పై విమర్శలు ప్రారంభించారు. విజయసాయి రెడ్డి వంటి వారు డోసు పెంచి మరీ విమర్శలు చేశారు.

వైసీపీ విమర్శలపై స్పందించిన టీడీపీ నేతలు కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు. తమ దిల్లీ పర్యటనపై పార్టీ కార్యాలయం లో మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన పయ్యావుల కేశవ్.. చంద్రబాబు ఒక్క పర్యటనతో ఢిల్లీలో వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు సగం కొట్టుకుపోయాయన్నారు. ఒక్కరోజు చంద్రబాబు దిల్లీలో ఉంటే వైకాపా ఎందుకో ఉలిక్కి పడుతోందని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. సీనియర్ పొలిటీషియన్ గా చంద్రబాబుకు అత్యున్నత స్ట్రేచర్ ఉందన్న పయ్యావుల కేశవ్.. అది వైసీపీకి అర్థం కాదంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య ఉన్నా.. తన దృష్టికి నిరభ్యతరంగా తీసుకు రావచ్చని రాష్ట్రపతి సూచించారు. ప్రత్యేకంగా పొలిట్ బ్యూరోలో చర్చించి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చంద్రబాబు సూచించారన్న పయ్యావుల కేశవ్.. రాష్ట్రపతితో భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. ఆమె ఒక తల్లిలా మాతో మాట్లాడారని.. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక నూటికి నూరుశాతం మంచి నిర్ణయం అని ఆమెను కలిశాక వ్యక్తిగతంగా మరింత స్పష్టత వచ్చిందని పయ్యావుల కేశవ్ అన్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేది చాలా ఉన్నతమైన కార్యక్రమన్న పయ్యావుల కేశవ్.. అందుకే చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సుదీర్ఘ కాలం తరువాత అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లారని.. మా పార్టీ అధినేతను దిల్లీలో అన్ని పార్టీల నేతలు, ప్రభుత్వ పెద్దలు బాగా రిసీవ్ చేసుకున్నారని పయ్యావుల కేశవ్ సంబరంగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: